అనంతపురంహోమ్

నందమూరి బాలకృష్ణ చొరవతో జాబ్ మేళా

#Hindupur

హిందూపురం నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిశానిర్దేశం, వారి ఆర్థిక సహకారంతో, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మద్దతుతో హిందూపురంలో భారీ మెగా జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించబడింది. ఈ జాబ్ మేళాలో దేశంలోని ప్రముఖ సంస్థలు సహా మొత్తం 110 కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు నిర్వహించాయి.

ముఖ్యంగా TCS, Bluespring, CEIL, THSC, Hexaware వంటి ప్రముఖ మల్టీనేషనల్ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ మెగా జాబ్ మేళాకు మొత్తం 5323 మంది నిరుద్యోగ యువత హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం 1903 మంది యువతను తక్షణమే ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా 868 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, వారికి రెండో మరియు మూడో దశ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఆ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. హిందూపురం నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు యువతలో కొత్త ఆశలను నింపుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు యువత భవిష్యత్తును బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related posts

గోవా పర్యాటక విధానం బాపట్లకు ఆదర్శం

Satyam News

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

Satyam News

చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి జైలు

Satyam News

‘సకల శాఖల సజ్జల’ పై ధ్వజమెత్తిన విజయసాయి రెడ్డి…

Satyam News

రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా కృషి: లింగమనేని రమేష్

Satyam News

ఆ పార్టీల పొత్తు కోసం జగన్‌ ఆరాటం…

Satyam News

Leave a Comment