జాతీయంహోమ్

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు

#MuslimWomen

ముస్లిం రిజర్వేషన్లను మహారాష్ట్ర రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది. మహారాష్ట్రలో ముస్లింలకు విద్యా ఉద్యోగాలలో ఐదు శాతం రిజర్వేషన్ ఉన్నది. ఇకపై మహారాష్ట్రలో విద్య ఉద్యోగాలలో ముస్లింలకు మహారాష్ట్రలో రిజర్వేషన్లు ఉండవు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం గవర్నమెంట్ రిజల్యూషన్ (GR) జారీ చేసింది.

ముందుగా జారీ చేసిన ఐదు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ గడువు ముగియడంతో పాటు, ఆ నిర్ణయంపై కోర్టు తాత్కాలిక నిలుపుదల (ఇంటరిమ్ స్టే) విధించబడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రభుత్వం మరాఠా వర్గానికి 16 శాతం, ముస్లిం వర్గానికి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.

కొత్తగా జారీ చేసిన GR ప్రకారం, స్పెషల్ బ్యాక్‌వర్డ్ కేటగిరీ (A) కింద సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు ప్రభుత్వ, అర్ధ ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యాసంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించిన అన్ని పూర్వ నిర్ణయాలు, ఆర్డినెన్స్‌లు రద్దు చేయబడ్డాయి.

అలాగే 2014లో జారీ చేసిన సంబంధిత ఉత్తర్వులు, సర్క్యులర్లు కూడా రద్దు చేయబడ్డాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పెషల్ బ్యాక్‌వర్డ్ కేటగిరీ కింద ముస్లింలకు కుల ధృవపత్రాలు, నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికెట్లు ఇకపై జారీ చేయబోవడం లేదని తాజా ఉత్తర్వులో పేర్కొంది.

Related posts

యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్” (PFA)

Satyam News

జై అమరావతి అంటూ విజయనగరంలో భారీ ర్యాలీ

Satyam News

ఎర్రకాలువ ముంపు సమస్యకు రూ.400 కోట్లతో శాశ్వత పరిష్కారం

Satyam News

విజయనగరం లో మోడీ ఫ్లెక్సీ తొలగింపు

Satyam News

తల్లి పాలలో ప్రమాదకర యురేనియం..?

Satyam News

నిరుద్యోలను మోసం చేసిన కాంగ్రెస్

Satyam News

Leave a Comment