ముఖ్యంశాలుహోమ్

కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

#MohanBabu

విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ప్రముఖ సినీ నటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్స్‌లర్‌ మంచు మోహన్‌బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేయాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. కిడ్నాప్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్సిటీ పీఆర్‌వో సతీశ్‌తో మోహన్‌బాబు ఫోన్‌లో మాట్లాడారని, మెసేజ్‌లు కూడా పంపుకున్నారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Related posts

300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు..

Satyam News

కాలుష్యరహితంగా గోదావరి పుష్కరాల నిర్వహణ

Satyam News

దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు ఇండోనేసియా పురస్కారం

Satyam News

CII సమ్మిట్ గ్రాండ్ సక్సెస్‌..బాబు, లోకేష్‌ సూపర్‌..

Satyam News

ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరించిన ట్రంప్

Satyam News

న్యూజెర్సీలో మీట్ అండ్ గ్రీట్ విత్ హరీష్ రావు

Satyam News

Leave a Comment