సినిమాహోమ్

నారా దేవాన్ష్ యూట్యూబ్ చాన‌ల్ Dino Deets ప్రారంభం

మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ “Dino Deets “పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ఆరంభించారు. ఈ సంద‌ర్భంగా నారా-నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. “Dino Deets “టీజ‌ర్‌లోనూ మంత్రి నారా లోకేష్ పాలుపంచుకుని దేవాన్ష్ యూట్యూబ్‌, పాడ్ కాస్ట్ ప్ర‌త్యేక‌తలు తెలుసుకున్నారు.

డైనోసార్లు, శిలాజాలు (fossils), పురాత‌న అవ‌శేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింత‌లు-విశేషాలు ఆక‌ట్టుకునే శైలిలో, న‌వ్విస్తూ, ఆలోచింప‌జేసేలా దేవాన్ష్ అందించే పాడ్ కాస్ట్‌లు ఈ యూట్యూబ్ చాన‌ల్ ద్వారా వీక్ష‌కుల‌కు చేర‌నున్నాయి. దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి నేను ఒక ప్రేక్ష‌కుడిలా ప్ర‌వేశించేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నానంటూ మంత్రి నారా లోకేష్ ఉద్విగ్నంగా త‌న భావాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ నారా దేవాన్ష్‌ చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను గతేడాది దేవాన్ష్‌ వేగంగా పరిష్కరించి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు.

ఛానెల్ లింక్స్

YouTube – https://youtube.com/@dinodeets

Instagram – https://www.instagram.com/dinodeets/

Facebook – https://www.facebook.com/DinoDeets/

Related posts

హుస్నాబాద్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి

Satyam News

సీఎం రేవంత్ కు నర్సస్ అసోసియేషన్ కృతజ్ఞతలు

Satyam News

మక్కాలో చిక్కుకుపోయిన 4 వేల మంది భారతీయులు

Satyam News

మంత్రి శ్రీధర్ బాబుతో విక్టోరియా విప్ లీ టార్లామిస్ భేటీ

Satyam News

కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి

Satyam News

Leave a Comment