సినిమాహోమ్

ఒక్కటైన రష్మిక మందన విజయ్ దేవరకొండ

#RashmikaMandana

ఉదయ్‌పూర్‌లో హిందూ, కొడవ పద్ధతుల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన, హీరో విజయ్ దేవరకొండ వివాహం జరిగింది. తెలంగాణ, కర్ణాటక వంటకాలతో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రెండు కుటుంబాల ముఖ్యమైన వ్యక్తుల సమక్షంలో సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుక జరిగింది. ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో పలువురు టాలీవుడ్ దర్శకులు, ప్రముఖులు సందడి చేశారు.

హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నేటి ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం విజయ్-రష్మికల వివాహం జరిగింది. వేదమంత్రాల సాక్షిగా, పట్టువస్త్రాల్లో ఈ జంట ఒక్కటైంది. అలాగే సాయంత్రం రష్మిక కుటుంబ సంప్రదాయమైన ‘కొడవ’ (కూర్గ్) ఆచారం ప్రకారం మరోసారి పెళ్లి తంతు నిర్వహించనున్నారు.

ఇందుకోసం కూర్గ్ ప్రత్యేక దుస్తులు, సంప్రదాయాలతో ఏర్పాట్లు చేశారు. రెండు వేడుకలతో ఈ డబుల్ వెడ్డింగ్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాహ వేడుకలకు ముందు ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. విజయ్, రష్మికలకు అత్యంత సన్నిహితులైన దర్శకులు సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, తరుణ్ భాస్కర్ సహా నటుడు రాహుల్ రవీంద్రన్, ఆషికా రంగనాథ్ వంటి ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

Related posts

ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది నారాయణ?

Satyam News

రైతులపై కపట ప్రేమ ఆపి డీజిల్ రేట్లు తగ్గించండి

Satyam News

బడ్జెట్ ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Satyam News

కొడుకు, కోడలి ఖాతాల్లోకి లిక్కర్ సొమ్ము..అడ్డంగా దొరికిన కారుమూరి.!

Satyam News

మెగా డీఎస్సీ నుంచి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ వరకూ…

Satyam News

మేనమామపై యుద్ధానికి వస్తున్న మేనల్లుడు

Satyam News

Leave a Comment