ముఖ్యంశాలుహోమ్

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి.!

#chandra

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్  రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తయారీ కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దాదాపు రూ. 2,508 కోట్ల పెట్టుబడితో ఈ భారీ పరిశ్రమను నెలకొల్పే ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి – SIPB బుధవారం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతున్న రాయలసీమ ప్రాంతానికి ఈ నిర్ణయం మరింత ఊపునిస్తుందంటున్నారు విశ్లేషకులు.

రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలనిస్తున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి గ్లోబల్ బ్రాండ్ ఏపీని ఎంచుకోవడం వెనుక రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, అనుకూలమైన పారిశ్రామిక విధానాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా విదేశీ, స్వదేశీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్న  మంత్రి నారా లోకేష్, ఈ డీల్‌ను ఒక కీలక విజయంగా భావిస్తున్నారు. తిరుపతి ప్రాంతం ఇప్పటికే చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌కు సమీపంలో ఉండటం ఈ సంస్థకు రవాణా పరంగా పెద్ద అసెట్‌గా మారనుంది.

ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై మంత్రి లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై తాను స్వారీ చేస్తున్నట్లు ఉన్న ఒక AI  వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంటూ, ఏపీకి ఎవరు రాబోతున్నారో చూడండి అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక పురోగతిపై పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రమోషన్లలోనూ టెక్నాలజీని వాడుతూ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

మొత్తానికి, తిరుపతి నుంచి త్వరలోనే డగ్ డగ్ మనే బుల్లెట్ శబ్దం వినిపించబోతోంది. కియా మోటార్స్ తర్వాత ఆ స్థాయిలో ఒక పెద్ద ఆటోమొబైల్ బ్రాండ్ ఏపీలో ప్లాంట్ పెడుతుండటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చే పరిణామం. ఈ పెట్టుబడితో పాటు దానికి అనుబంధంగా వచ్చే స్పెర్ పార్ట్స్ యూనిట్లు, సర్వీసింగ్ సెంటర్ల వల్ల తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రభుత్వం చూపిస్తున్న ఈ దూకుడు రాబోయే రోజుల్లో మరిన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఏపీ వైపు ఆకర్షించే అవకాశం ఉంది.

Related posts

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

Satyam News

మద్యం మత్తులో కారు పైకి బైక్‌తో దూసుకెళ్లిన యువకుడు

Satyam News

IDFC First Bankలో భారీ కుంభకోణం

Satyam News

ముగ్గురు రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ

Satyam News

సానియా తో అర్జున్ టెండుల్కర్ ఎంగేజ్మెంట్

Satyam News

Leave a Comment