హైదరాబాద్హోమ్

6 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

#Rain

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి 6 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం నుంచి 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది.

సోమవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీగా వర్షం కురవనుందని, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

మంగళవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకు ద్రోణి, రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

102 మండలాల్లో వడగాలులు

రాష్ట్రంలో ఆదివారం 10 జిల్లాల పరిధిలోని 102 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. 33 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలతో.. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో అత్యధికంగా 7.4 సెం.మీ వర్షపాతం నమోదైంది.

జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో 6.7, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండలో 6.1, వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం పెద్యూముంతల్‌ 5.4, సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలో 5.1, నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపూర్‌లో 5 సెం.మీ వర్షం కురిసింది.

Related posts

పేదల తిరుపతి ఆలయ పునర్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

Satyam News

ఇస్లామాబాద్ అష్ట దిగ్బంధనం: చర్చలు ఎప్పుడో….

Satyam News

వైమానిక సంస్థను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌

Satyam News

మహిళలకు క్షమాపణ చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

Satyam News

గల్ఫ్ దేశాల ప్రజలు ట్రంప్ వ్యాపార ప్రాంతాలకు దగ్గర గా ఉండద్దు

Satyam News

చిమ్మ చీకట్లో ఐజ ప్రభుత్వ ఆసుపత్రి

Satyam News

Leave a Comment