క్రీడలుహోమ్

ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు

#SSGSportsMeet

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ సెక్యూరిటీ  గ్రూప్ వార్షిక క్రీడల పోటీలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని ఎస్ఎస్ జీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ చంద్ర లడ్హా, ఐజీ పీహెచ్ డీ రామకృష్ణ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డైరెక్టర్ ఏ.జగదీష్, ఎస్పీ చెన్నుపాటి భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షిక పోటీల్లో 25 క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా  టగ్ ఆఫ్ వార్ పోటీలను ప్రారంభించారు.

క్రీడల పోటీల్లో ఆరు విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచిన  ఎస్. కమలేంద్రరావు ఈ ఏడాది వార్షిక క్రీడల్లో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచారు. క్రీడలు శారీరక ధృడత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని, టీమ్ స్పిరిట్ ను పెంపొందిస్తాయని ఇంటెలిజెన్స్ చీఫ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

కార్యక్రమం ముగింపులో అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రీడాపోటీలను నిర్వహించేందుకు సహకరించిన ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం అధికారులు, శాప్ చైర్మన్ రవినాయుడు, ఇతర అధికారులకు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్  ధన్యవాదాలు తెలియచేసింది.

Related posts

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన వనపర్తి ఎస్పీ

Satyam News

జగన్ పీఆర్ఓ పూడి శ్రీహరిపై హైకోర్టు సంచలన నిర్ణయం

Satyam News

మహిళలకు క్షమాపణ చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

Satyam News

మరో సారి వంట గ్యాస్ ధర భారీగా పెంపు

Satyam News

అమరావతి ఇక అఖండ జ్యోతి!

Satyam News

తీవ్ర రూపం దాల్చిన యుక్రెయిన్ రష్యా యుద్ధం

Satyam News

Leave a Comment