కృష్ణహోమ్

వియత్నాం పడవ ప్రమాదంపై లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

#NaraLokesh

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న మంత్రి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారనే ప్రాథమిక సమాచారంపై తక్షణమే రంగంలోకి దిగారు.

ఈ విషయమై ఢిల్లీలోని ఏపీ భవన్ సీనియర్ అధికారులతో  రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ అత్యవసరంగా మాట్లాడారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరదాగా విహారయాత్ర (టూరిజం) కోసం వియత్నాం వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) తో ఏపీ భవన్ అధికారులు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు మంత్రికి తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు పర్యాటకులకు అన్ని రకాల  అత్యవసర సహాయాలు అందేలా కేంద్ర విదేశాంగ శాఖతో పాటు సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.

Related posts

శ్రీవారికి వెండి గంగాళం విరాళం

Satyam News

ఇరాన్ ను మళ్లీ రెచ్చగొడుతున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News

No Sleep: నిద్ర పై ఎల్ ని నో తీవ్ర ప్రభావం

Satyam News

జగన్ పీఆర్ఓ పూడి శ్రీహరిపై హైకోర్టు సంచలన నిర్ణయం

Satyam News

భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేత సస్పెన్షన్

Satyam News

Leave a Comment