ప్రత్యేకంహోమ్

యూపీలో పట్టుబడ్డ స్టాండప్ కమెడియన్ అనుదీప్

సినీ సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్ అయ్యారు. కాకినాడ పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నిహారిక, రామ్ చరణ్‌లపై అనుదీప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆ వీడియోలను చూసిన మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షో జరుగుతున్న చోటుకు వెళ్లారు.

అయితే, ఈ విషయం తెలుసుకున్న అనుదీప్ అక్కడినుంచి పరారయ్యాడు. రెండు రోజుల తర్వాత మెగా కుటుంబానికి క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. అయినా అతని తీరుపై మండిపడ్డారు. మెగా ఫ్యాన్స్ దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి అనుదీప్ అజ్ఞాతంలో ఉంటున్నాడు.

కాకినాడ పోలీసులు అనుదీప్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు యూపీలో మంగళవారం ఫ్యామిలీతో కలిసి ఓ పార్క్ లో ఉన్నట్టు కాకినాడ పోలీసులు కనిపెట్టారు. అతడిని ఉత్తర ప్రదేశ్‌నుంచి ఏపీకి తీసుకువస్తున్నారు.

Related posts

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News

వార్ రూమ్ లో ఖొమైనీ: వీడియో వైరల్

Satyam News

రాయచోటిలో వర్ష బీభత్సం: నలుగురు మృతి

Satyam News

అసెంబ్లీ కి వెళ్లనున్న సినీ హీరోయిన్ త్రిష?

Satyam News

పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం

Satyam News

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తాం

Satyam News

Leave a Comment