26.3 C
Hyderabad
September 19, 2026
సంపాదకీయంహోమ్

ఏపీలో సీ ఓటర్‌ లేటెస్ట్ సర్వే.. కళ్లు మూసుకుంటే.. గెలిచేస్తారు….!!

#Vote

కళ్లు మూసుకుంటే మూడేళ్లు అయిపోతాయి.. మనం అధికారంలోకి వస్తాం.. మైకు దొరికితే చాలు.. జగన్‌ రిపీట్‌ చేసే డైలాగ్‌ ఇది. అసలు ఈ మటల్లో నిజమెంత.. ఇది కూడా వైనాట్ వన్‌ సెవెన్టీ ఫైవ్‌ లాంటిదేనా అని సాధారణ ప్రజలతో పాటు వైసీపీ నాయకులకు చాలా అనుమానాలున్నాయి. సీ ఓటర్‌ సంస్థ నిర్వహించిన సర్వే ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానం ఇస్తోంది. గ్రౌండ్‌ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది.. ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారో తెలుసుకోవడానికి చేసిన సర్వేలో ఏపీలోని ప్రధాన పార్టీలకు మైండ్‌ బ్లాంక్ అయ్యే ఫలితాలు వచ్చాయి.

2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసినప్పుడు 3 పార్టీలకు కలిపి 55.3 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు వైసీపీకి 39.4 శాతం ఓట్లు దక్కాయి. ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందని జగన్‌ అండ్‌ కో ప్రచారం చేస్తున్నారు. కానీ సీ ఓటర్‌ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.. కూటమి పార్టీలకు గతంలో కంటే ఎక్కువగా 57.5 శాతం ఓట్లు వస్తాయని తేలింది. వైసీపీకి 37.5 శాతం మంది మాత్రమే ఓటేస్తారట. ఈ లెక్కన టీడీపీ కూటమికి, వైపీపీకి మధ్య 20 శాతం ఓట్ల తేడా ఉంది. టీడీపీ, జనసేన కలిసి ఉంటే 2029లోనూ ఇదే ఫలితం రిపీట్ అవుతుంది.

టీడీపీ, జనసేన కలిసి ఉన్నంత వరకు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని విజయసాయిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లాంటి జగన్‌ శ్రేయోభిలాషులు చెప్పింది నిజమే అని సీ ఓటర్ సర్వే మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వైసీపీ ఓటు బ్యాంకు కరిగిపోయింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలతో మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని సీ ఓటర్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఐదేళ్ల జగన్‌ పాలనలో చెప్పుకోవడానికి చేసిందేమీ లేకపోవడంతో.. కూటమి ప్రభుత్వంపైన వ్యతిరేకత మీదే వైసీపీ నమ్మకం పెట్టుకొంది. కానీ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమక్షేమమే లక్ష్యంగా పనులు చేస్తోంది. జగన్‌ హయాంలో చేసిన అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఈ తేడా ప్రజలకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే సీ ఓటర్‌ సర్వేలో ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వానికే జై కొట్టారు.

Related posts

తల్లిపై కన్నేసి కొడుకును కిడ్నాప్ చేసిన లవర్

Satyam News

త్వరలో వస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ

Satyam News

అనంతబాబుకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు?

Satyam News

నిష్పాక్షిక విశ్లేషణ: బీహార్ లో గెలుపు ఎవరిది?

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

Satyam News

వైకుంఠద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

Leave a Comment