ముఖ్యంశాలుహోమ్

యుద్ధం నేపథ్యంలో TGWWC ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఇరాన్ దాడుల పరిణామాలతో ఇక్కడ పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు మరియు వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి (TGWWC) ఒమాన్ శాఖ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కొంతమంది కార్మికులు తెలియక ప్రస్తుత పరిస్థితులను వీడియోల రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం గల్ఫ్ దేశాల కఠిన చట్టాల ప్రకారం తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని అన్నారు. అలాంటి చర్యలు వ్యక్తిగత భద్రతకే కాకుండా ఇతర కార్మికుల భద్రతకూ ముప్పు కలిగించే అవకాశముందని పేర్కొన్నారు.

కార్మికులంతా ఆయా దేశాల ప్రభుత్వాలు విడుదల చేస్తున్న అధికారిక గైడ్‌లైన్స్‌ను మాత్రమే అనుసరించాలని, అనవసర ప్రయాణాలు పూర్తిగా నివారించాలని, స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే విదేశాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడి తమ క్షేమ సమాచారాన్ని తెలియజేయాలని కోరారు. ఇంటికాడ కుటుంబ సభ్యులు సమాచారం లేకపోతే మరింత ఆందోళనకు గురవుతారని, అందువల్ల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండేలా మనం నిరంతరం సమాచారం అందించడం ప్రతి కార్మికుడి బాధ్యత అని స్పష్టం చేశారు. సెలవులపై స్వదేశానికి వెళ్లే కార్మికులు ఫ్లైట్ రద్దు కావడం వల్ల టికెట్ల విషయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు

ఎయిర్ లైన్స్ విమానాల పునరుద్ధరణ ప్రకటన వచ్చినంక మీ టికెట్స్ రీ షెడ్యూల్ విషయంలో ఎయిర్ లైన్స్ తో మాట్లాడి సహకరిస్తామని ఈ సందర్భంగా అన్నారు

ఈ సందర్భంగా TGWWC రాష్ట్ర కార్యదర్శి పాలాజీ శ్రీనివాసు మాట్లాడుతూ, ఒమాన్ ప్రభుత్వం మరియు సంబంధిత అధికార యంత్రాంగం సోషల్ మీడియా వేదికల ద్వారా విడుదల చేసిన సూచనలు, గైడ్‌లైన్స్‌ను సమగ్రంగా సమీక్షించి, వాటిని ఒమాన్ శాఖ కోఆర్డినేటర్లు మరియు కార్మికులకు ఇప్పటికే తెలియజేసినట్లు తెలిపారు. ప్రతి కార్మికుడు ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

ఒమాన్‌లోని తెలంగాణ కార్మికులు ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఎదుర్కొన్నా TGWWC ఒమాన్ శాఖ సభ్యులను వెంటనే సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు:

📞 +968 80071234

📞 +968 98292270

కు సంప్రదించి అవసరమైన సహాయం పొందవచ్చని సూచించారు.

“మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందవద్దు… మీ వెంటే TGWWC ఉంది. ప్రతి కార్మికుడి భద్రత, వారి కుటుంబాల విశ్వాసం మా బాధ్యత” అని నాయకులు భావోద్వేగభరితంగా భరోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో TGWWC రాష్ట్ర కార్యదర్శి పాలాజీ శ్రీనివాసు, ఒమాన్ శాఖ అధ్యక్షులు జావుడాల సత్తన్న, మస్కట్ కోఆర్డినేటర్లు గోగు దేవరాజు తదితర కోఆర్డినేటర్లు మరియు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Related posts

విశాఖకు ఏఐ పవర్.. గ్లోబల్‌ ఐటీ మ్యాప్‌లో ఏపీ

Satyam News

గూగుల్ కు విశాఖే ఎందుకు నచ్చింది?

Satyam News

వైసీపీ సింపతీ ఫార్ములాకు ఎక్స్‌పైరీ డేట్.. జనాల్లో రివర్స్ ఎఫెక్ట్‌!

Satyam News

Satyam News

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయండి

Satyam News

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన

Satyam News

Leave a Comment