ఆధ్యాత్మికంహోమ్

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

#Tirumala

శ్రీ‌వారి ఆల‌యంలో మంగళవారం రాత్రి 8 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఉదయం 9 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూశారు.

దాదాపు 10.30 గంట‌ల అనంత‌రం మంగళవారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభం

చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా మంగళవారం ఉదయం 9 గంట‌లకు మూసివేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్సును 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం రాత్రి 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి.

వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి

తిరుమలలో మంగళవారం కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం సిబ్బంది పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీరు పంచిపెట్టారు. వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లను పర్యావేక్షించారు.

Related posts

జగన్ APPSC గ్రూప్-1 ప్రక్రియలో వెలుగు చూసిన అక్రమాలు!

Satyam News

బొత్స కన్నీటి వెనక అసలు నిజం..??

Satyam News

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు

Satyam News

వేసవిలో నీటి తొట్టెల ద్వారా పశువులకు తాగునీరు

Satyam News

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News

ఇందాపూర్‌.. వైసీపీ….. ఓ కల్తీ కథ…!!

Satyam News

Leave a Comment