జాతీయంహోమ్

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

#Uttarakhand

బస్సు అదుపుతప్పి సుమారు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. తెహ్రీ గర్వాల్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో గులార్ బజార్ సమీపంలోని గులార్ వంతెన వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదం జరిగిన వెంటనే ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ప్రయాణికుడు రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న వెంటనే బియాసీ ఎస్‌డీఆర్‌ఎఫ్ కేంద్రం నుంచి సబ్‌ఇన్‌స్పెక్టర్ సవర్ సింగ్ నేతృత్వంలోని సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టింది. లోయలో పడిపోయిన బస్సు నుంచి మృతదేహాలను వెలికితీసి రహదారి వద్దకు తీసుకొచ్చారు.

ప్రమాదంలో గాయపడిన 26 మందిని కూడా బస్సు నుంచి బయటకు తీసుకొచ్చారు. లోయ ప్రాంతం కొండలు, రాళ్లతో కూడి ఉండటంతో క్షతగాత్రులను స్ట్రెచర్లపై మోసుకుంటూ రహదారి వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఆసుపత్రులకు తరలించారు.

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బన్స్వాడా-మోహన్‌ఖాల్ మోటారు రహదారిపై ఓ బొలెరో వాహనం అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో నలుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోఖ్రీ ప్రాంతం నుంచి రాన్సీ వైపు వెళ్తున్న బొలెరో వాహనం భట్వారీ-కందారా సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ వాహనంలో సుమారు తొమ్మిది నుంచి పది మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు

Satyam News

కేరళ స్టోరీ 2కు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

Satyam News

‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ వ్యవస్థప్రారంభం

Satyam News

మరిడి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

Satyam News

కంచె నిర్మాణాన్ని అడ్డుకుంటున్న బంగ్లాదేశీయులు

Satyam News

మేడిగడ్డ వద్ద పాతిపెట్టడమే వారికి సరైన శిక్ష

Satyam News

Leave a Comment