విశాఖపట్నంహోమ్

బంగాళాఖాతంలో తీవ్ర రూపందాల్చిన అక్వాన్ తుపాన్

#Rain

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తీవ్ర తుపాన్ క్రమంగా ముందుకు కదులుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఈ తుపాన్ ప్రస్తుతం నరసాపురానికి 540 కిలోమీటర్లు, చెన్నైకి 570 కిలోమీటర్లు, కళింగపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే గోపాల్‌పూర్‌కు 690 కిలోమీటర్లు, పూరీకి 770 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు RTGS–APSDMA వెల్లడించింది.

అక్వాన్ తీవ్ర తుపాన్ ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం–పూరీ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపాన్‌గా దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హెచ్చరించింది.

ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తుపాన్ ప్రభావం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు. తుపాన్ కదలికలు, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Related posts

తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం

Satyam News

ప్రధాని మోడీ అవతార పురుషుడు

Satyam News

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బతుకమ్మ వేడుకలు

Satyam News

శ్రీశైలానికి కాలినడకన చేరుకున్న కర్ణాటక భక్తులు

Satyam News

రోడ్డెక్కిన దస్తావేజుల లేఖరులు

Satyam News

సిరిసిల్ల వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలించిన కేటీఆర్

Satyam News

Leave a Comment