మెదక్హోమ్

రేపు సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

#CMRevanth

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం (నవంబర్ 19) సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మొత్తం రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో రూ.451.13 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనుండగా, ఇప్పటికే రూ.92.98 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

విద్యారంగానికి పెద్దపీట

దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాల్లో రూ.200 కోట్ల చొప్పున నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, రూ.13.50 కోట్లతో ఆరు తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధి

జనగామ నియోజకవర్గంలో రూ.6.89 కోట్లతో నిర్మించనున్న మూడు విద్యుత్ సబ్‌స్టేషన్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. సిద్ధిపేట జిల్లాలో రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్‌స్టేషన్లను ప్రారంభించనున్నారు.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు సౌకర్యాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ.14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రాన్ని, రూ.12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలను, రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని, గజ్వేల్‌లో రూ.1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సిద్ధిపేట జిల్లాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

విశాఖకి అమెజాన్‌..  ఐటీ ప్లస్‌ AWS డేటా సెంటర్‌..!

Satyam News

కలెక్టర్ కు పిర్యాదు చేసినా చర్యలు నిల్

Satyam News

“జిందగీ ఇన్ టూ షేడ్స్” ఫిల్మ్ మేకర్’గా డాలి టోమర్’కి ఉజ్వల భవిష్యత్

Satyam News

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ భరోసా

Satyam News

వనపర్తిలో ఎసిబి కార్యాలయం ఏర్పాటు చేయాలి

Satyam News

భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్న 212 గుండెలు

Satyam News

Leave a Comment