గుంటూరుహోమ్

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు మోడల్ స్కూల్

రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ చొరవ తో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను మోడల్ స్కూల్ (లీప్ స్కూల్)గా తీర్చిదిద్దుతున్నారు.. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి.

ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం బేతపూడి, నీరుకొండ, కురగల్లు, నిడమర్రు, బాపూజీ నగర్, శిబిరం ప్రాంతాల నుంచి 520 విద్యార్థులు ఉన్నారు.

తరగతి గదుల్లో గ్రీన్బోర్డు, చార్ట్ బోర్డులు, డిజిటల్ పాఠాలు వినేలా ఐఎఫ్ఎ ప్యానల్,మోడరన్ టేబుల్స్, ఛైర్స్ ఫుట్బాల్ కోర్టు, దాని చుట్టూ 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఫ్లడ్ లైట్లు, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాలకు మల్టీస్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం సుమారు 400 మంది విద్యార్థులు వీక్షించే విధంగా యాంపీ థియేటర్ తోపాటు సైన్స్ మ్యూజియం ఉన్నాయి.

చుట్టూ పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా దనం 500 మందికి సరిపడే డైనింగ్ హాల్, తాగునీటి ఆర్వో ప్లాంట్, స్కూల్ పరిసర ప్రాంతాల చుట్టూ 40 సీసీ కెమెరాలు ఇంటర్నేషనల్ ఫిజిక్స్, బయాలజీ బ్లాక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ ల్యాబ్లు, ఆటల్ టింకరింగ్ ల్యాబ్, గ్రంథాలయం. పూలు, పండ్లు, కూరగా యల మొక్కలతో కిచెన్ గార్డెన్ ప్రత్యేక పార్కింగ్ స్థలం,చిన్నారులకు ఏడు రకాల ఆట పరికరాలతో చిల్డ్రన్స్ పార్కు అధ్యాపకులకు లిఫ్ట్ సౌకర్యం ఉంది.

ఈ పాఠశాల మొత్తం 5.02 ఎకరాల స్థలంలో ఉంటుంది. రూ.16 కోట్ల నిధు లతో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు. ఏ-బ్లాక్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల కోసం 28 గదులు నిర్మించారు. ప్రిన్సిపల్ రూం,స్టాఫ్ రూమ్ వంటివి ఏర్పాటు చేశారు.

బీ బ్లాక్లో 9 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. ఇందుకోసం 12 గదులు ఉన్నాయి. ఈ బ్లాక్ లో మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించారు. ఒకటి, రెండో తరగతి చిన్నారులను ఆకట్టుకునేలా, చదువుపై ఆసక్తి పెరిగేలా గోడలపై బొమ్మలు వేయించారు.

Related posts

పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం

Satyam News

రోడ్డెక్కిన జనసేన కార్యకర్తలు

Satyam News

ఇండక్షన్ స్టౌ లకు పెరిగిన డిమాండ్

Satyam News

విజయవాడ ఉత్సవ్‌ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

Satyam News

సుప్రీంకోర్టు సంచలనం.. పెద్దిరెడ్డి పల్స్‌ డౌన్‌….!!

Satyam News

ప్రకృతి ప్రసాదించిన ఔషదాల గని కాకర

Satyam News

Leave a Comment