సినిమాహోమ్

విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్న సంగీత

#TrishaKrishnan

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత జోసెఫ్ విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత సోర్నలింగం తన భర్తపై చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గత కొన్ని నెలలుగా రాష్ట్ర రాజకీయాలు, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంలో కొత్త మలుపు చోటుచేసుకుంది.

సంగీత ఈ ఏడాది ప్రారంభంలో విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పిటిషన్‌లో దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తాయని, దాని వల్ల తనకుమానసిక వేదన కలిగిందని, అంతే కాకుండా విజయ్ కి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేశారు. అలాగే భరణం, నీలంకరైలోని నివాసంలో ఉండే హక్కు వంటి అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆరోపణలపై విజయ్ లేదా ఆయన తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

విడాకుల కేసు పలుమార్లు విచారణకు వచ్చినప్పటికీ ఇరు పక్షాలు వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. చివరిసారిగా కోర్టు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది.

తాజా సమాచారం ప్రకారం, సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై కోర్టులో అధికారికంగా దరఖాస్తు సమర్పించిన తర్వాతే చట్టపరమైన ప్రక్రియ పూర్తికానుంది. ఈ విషయంపై విజయ్ లేదా సంగీత తరఫున ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల కోర్టు ధృవీకరణ అనంతరం మాత్రమే తుది పరిణామం స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.

Related posts

ఆటో డ్రైవర్లకు 16 కండిషన్లు

Satyam News

తెలంగాణ లో నడుస్తున్నది రౌడీ రాజ్యం

Satyam News

మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీ

Satyam News

కాకినాడలో “స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర”

Satyam News

మళ్ళీ విచారణ కు హాజరైన సునీల్ నాయక్

Satyam News

బొండా ఉమా వివరణ తీసుకోండి.. చంద్రబాబు ఆదేశాలు

Satyam News

Leave a Comment