సంపాదకీయంహోమ్

వైసీపీ సింపతీ ఫార్ములాకు ఎక్స్‌పైరీ డేట్.. జనాల్లో రివర్స్ ఎఫెక్ట్‌!

#Jagan

రాజకీయాల్లో సెంటిమెంట్, సింపతీ అనేవి అత్యంత బలమైన ఆయుధాలు. అందులో సందేహం లేదు. కానీ, ఒకే అస్త్రాన్ని మాటిమాటికీ ప్రయోగిస్తే అది తుప్పు పట్టిపోతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే, వారి సంప్రదాయ సింపతీ రాజకీయం కాలపరిమితి ముగిసిపోయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికలు లేదా ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చిన ప్రతిసారీ బాధితుడి పాత్రలోకి వెళ్లడం, విపక్షాలపై నెట్టడం, తద్వారా ఓటర్ల నుంచి సానుభూతి పొందాలని చూడటం వైసీపీకి అలవాటుగా మారింది. గతంలో ఒకసారి వర్కవుట్ అయిన ఈ సెంటిమెంట్ డ్రామాలు, ఇప్పుడు జనాల్లో తీవ్రమైన రివర్స్ ఎఫెక్ట్ ఇస్తున్నాయనే చర్చ జోరందుకుంది.

ఈ ఫేక్ సింపతీ పాలిటిక్స్‌కు మూలం‌ గత 2019 ఎన్నికలకు ముందు జరిగిన కోడికత్తి ఉదంతం. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన ఆ చిన్నపాటి దాడిని, రాజకీయంగా ఎలా వాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుంది.

ఆ తర్వాత సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య ఉదంతాన్ని కూడా రాజకీయ లబ్ధికోసం ప్రత్యర్థి పార్టీల ఖాతాలో వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. కానీ, కాలక్రమేణా ఆ విచారణలు ఎటు తేలకపోవడం, పైగా సొంత కుటుంబ సభ్యులే కోర్టుల చుట్టూ తిరుగుతూ అసలు నిందితులు ఎవరో వేలెత్తి చూపుతుండటంతో ఆ  బాబాయ్ హత్య సెంటిమెంట్ కాస్తా వైసీపీకే బూమరాంగ్ అయింది. అధికారంలో ఉండి కూడా నిందితులకు రక్షణ కల్పిస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీపైకే రావడంతో, జనం ఈ నాటకాలను నిశితంగా గమనించడం ప్రారంభించారు.

ఇక ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో తెరపైకి వచ్చిన  గులకరాయి దాడి సంఘటన ఈ సింపతీ డ్రామాలకు పరాకాష్ట. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై రాయి పడితే, దాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా చిత్రీకరించి మళ్లీ సానుభూతి పిండుకునేందుకు సోషల్ మీడియా వింగ్ నుంచి మొదలుకుని మంత్రుల దాకా అంతా ఒకే స్క్రిప్ట్ ప్రకారం రంగంలోకి దిగారు.

కానీ, ఈసారి ప్రజల్లో ఆశించిన స్పందన రాలేదు సదా, ఇదంతా కేవలం ఎన్నికల స్టంట్ అనే సోషల్ మీడియా ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి. కోడికత్తి నుంచి గులకరాయి దాకా జరిగిన ప్రతీ సంఘటన వెనుక ఉన్న రాజకీయ లబ్ధి కోణాన్ని సామాన్య ప్రజలు సైతం సులువుగా డీకోడ్ చేయగలుగుతున్నారు. మాటిమాటికీ విక్టిమ్ కార్డ్ వాడుతూ ఓట్లు అడగడం ఏంటనే విసుగు ఓటర్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

రాజకీయాల్లో ఒక వ్యూహం ఒకసారి ఫలించవచ్చు, కానీ దాన్ని నిరంతరం పునరావృతం చేస్తే ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింటుంది. వైఎస్ వివేకా హత్య కేసులో అసలు దోషులు ఎవరో తేల్చలేకపోవడం, కోడికత్తి కేసులో ఇన్నేళ్లయినా ఎలాంటి పురోగతి లేకపోవడం, గులకరాయి డ్రామాలు త్వరగానే వెలుగులోకి రావడం వల్ల వైసీపీ చెబుతున్న కథలపై జనానికి నమ్మకం పోయింది. కేవలం సింపతీ కార్డుతోనే ప్రతీసారి గట్టెక్కలేమని, పాలనలో ఏం చేశామనే దానిపైనే ఓట్లు అడగాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Related posts

విజయ్ కి మళ్లీ బ్రేక్ వేసిన గవర్నర్

Satyam News

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

Satyam News

దానాలకు శ్రేష్ఠం సంక్రాంతి పండుగ రోజు

Satyam News

అమరావతిలో వర్చువల్‌ స్టూడియోలు…. మల్టీ మీడియాలో లక్షన్నర జాబ్స్..!!

Satyam News

తిరుమల నుంచి అన్యమతస్తులు ఔట్‌…!

Satyam News

IDFC First Bankలో భారీ కుంభకోణం

Satyam News

Leave a Comment