జాతీయంహోమ్

జమ్మూ కాశ్మీర్ లో లష్కరే తొయిబా మొత్తం ఖతం

#AmitShah

జమ్మూ కాశ్మీర్ లో లష్కరే తొయిబా ఖతం అయినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాశ్మీర్‌ లోయలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన చివరి క్రియాశీల స్థానిక ఉగ్రవాది మహమ్మద్‌ లతీఫ్‌ భట్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

పోలీసులు, భారత సైన్యం, కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగాలు, నిఘా సంస్థలు సమన్వయంతో ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు అమిత్‌ షా తెలిపారు. భద్రతా సంస్థల మధ్య అత్యున్నత స్థాయి సమన్వయం కనిపించిందని ప్రశంసించారు. దేశ భద్రత కోసం ధైర్యసాహసాలతో పనిచేసిన పోలీసు, సైనిక, పారామిలటరీ సిబ్బందికి దేశం సెల్యూట్‌ చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.

కుల్గాం జిల్లాలోని జంగల్‌పొరా గ్రామ పరిధిలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో లతీఫ్‌ భట్‌ ఓ మసీదులో తలదాచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లొంగిపోవాలని భద్రతా అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అతడు అంగీకరించలేదని తెలిపారు. చివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు హతమయ్యాడు. ఆపరేషన్‌లో మసీదుకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

లతీఫ్‌ భట్‌కు చెందిన మరో సహచరుడు ఉమర్‌ నిసార్‌ కూడా కుల్గాం జిల్లాలో సోమవారం జరిగిన మరో ఎదురుకాల్పుల ఘటనలో హతమయ్యాడు. నవంబర్‌ 11న కుల్గాంలోని అక్రాన్‌ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ పోస్టుపై జరిగిన దాడిలో ముగ్గురు సిబ్బంది గాయపడిన ఘటనతో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ దాడి అనంతరం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

Related posts

మహాలక్ష్మీకి రెండు సంవత్సరాలు పూర్తి

Satyam News

ఎర్రకాలువ ముంపు సమస్యకు రూ.400 కోట్లతో శాశ్వత పరిష్కారం

Satyam News

ఈడబ్ల్యూఎస్ క్రెడిట్ కో అపరేటివ్ సొసైటీల ఏర్పాటు

Satyam News

పవన్ కల్యాణ్ పై విమర్శలకు చంద్రబాబు సమాధానం

Satyam News

‘‘అక్రమ’’ జర్నలిస్టు అరెస్టు

Satyam News

రోడ్డు ప్రమాదం లో హీరో భారత్ కాంత్ మృతి

Satyam News

Leave a Comment