ముఖ్యంశాలుహోమ్

అర్నబ్ తుపానుతో ఆంధ్రప్రదేశ్ లో రెడ్ ఎలర్ట్

#Rain

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారిందని, అక్టోబర్‌ 27 నాటికి ఇది తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. వాతావరణ శాఖ జాతీయ బులెటిన్‌ నంబర్‌ 8 ప్రకారం సోమవారం ఉదయం 5.30 గంటలకు తుపాను తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. అంతకుముందు ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలింది.

ఈ తుపానుకు ‘అర్నబ్‌’ అని పేరు పెట్టారు. అక్టోబర్‌ 28 ఉదయం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్‌, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం అర్ధరాత్రి నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని, అక్టోబర్‌ 27 నాటికి అతి తీవ్ర తుపానుగా బలపడవచ్చని అంచనా వేసింది. అనంతరం వాయవ్య దిశగా పయనించి అక్టోబర్‌ 28 ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటవచ్చని తెలిపింది. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గాలుల వేగం అప్పుడప్పుడు గంటకు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించింది.

తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్‌ 27, 28 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది. అక్టోబర్‌ 29న కూడా ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ ప్రజలను అప్రమత్తం చేశారు. రానున్న మూడు రోజులు అత్యంత కీలకమని, తుపాను క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు వాతావరణ శాఖ, అధికార యంత్రాంగం జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts

తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు

Satyam News

ఈడీ 2.0: తొలి ఆతిథ్యం అందుకున్న మాజీ ఏ2!

Satyam News

ఈడబ్ల్యూఎస్ క్రెడిట్ కో అపరేటివ్ సొసైటీల ఏర్పాటు

Satyam News

తనకు రక్షణ కల్పించండంటూ గర్భిణి వేడుకోలు

Satyam News

వేధింపులే యువ డాక్టర్ ఆత్మహత్య కు కారణం

Satyam News

పెళ్ళిళ్ళ సీజన్ లో పసిడి ప్రేమికులకు భారీ ఊరట

Satyam News

Leave a Comment