30.2 C
Hyderabad
September 11, 2026
రంగారెడ్డిహోమ్

అడ్డూ ఆపు లేకుండా అక్రమ ఇసుక దందా

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట మండలం ఇసుక అక్రమ దందాకు అడ్డాగా మారింది. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల నిర్లక్ష్యమే అందుకు కారణం అంటూ మండలవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం బాహాటంగా ఇసుక అక్రమ దందా కొనసాగడం పట్ల మండల ప్రజలు అధికారుల నిర్లక్ష్యం పట్ల పలు ఆరోపణలు చేస్తున్నారు.

పండుగ దినాలు, సెలవు రోజుల్లో ఈ ఇసుక అక్రమ దందా మరింత జోరుగా సాగుతూ అడ్డు అదుపు లేకుండా అక్రమ దందా కొనసాగుతోంది. కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట మండల పరిధిలోని కాగ్నా వాగు ప్రారంభ ప్రాంతమైన తుంకిమెట్ల జాతీయ రహదారి నుంచి బొంరాస్ పేట, మహంతిపూర్ , దుప్ చర్ల, మద్దిమడుగు తాండ, జానకంపల్లి తదితర ప్రాంతాల నుంచి యాలాల మండల శివారు వరకు కాగ్నవాగు పారుతుంది.

భారీ ఎత్తున కురిసిన వర్షాలకు ఈ వాగులో ఇసుక పేరి అక్రమ ఇసుక అసురులకు ఆదాయంగా మారింది. దీన్ని కాపాడాల్సిన మైనింగ్ జువాలజికల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతైనా ఉంది. కానీ మామూళ్లకు అలవాటుపడ్డ అధికారులు, రాజకీయ అండదండలున్న పలువురు నాయకుల సహాయం తో కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

ఉగాది, రంజాన్, ఆదివారం ఇలా వరుసగా సెలవు రోజులు రావడంతో పట్టపగలే వాగులో నుంచి ఇసుక అక్రమాలు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్లు చేయడం, అక్కడి నుంచి టిప్పర్ల కొద్దీ పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున అక్రమ దందా కొనసాగుతోంది.

దీన్నంతా స్థానిక లీడర్లు, అక్రమ దందాకు అలవాటు పడ్డ నాయకులే కొనసాగిస్తున్నారని సదరు అధికారులకు కూడా తెలుసు. డంపింగ్ చేసిన ఇసుక కుప్పలను పోలీసులకు అప్పగించిన తెల్లారే వరకు మాయమవుతున్నాయని సదరు రెవెన్యూ అధికారులు చెప్పడం మరింత శోచనీయం.

పోలీసు సిబ్బంది సదరు ఎస్సై అసలు పట్టించుకోవడంలేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వ పనులకు నేరుగా కలెక్టర్ నుంచి ఇసుక అనుమతులు వస్తున్నప్పటికీ అంతకు ఐదంతలు అక్రమ దందా నిత్యం కొనసాగుతుందనేది అక్షరాల సత్యం అంటూ స్థానికులు చెబుతున్నారు. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

 

 

Related posts

తుఫాను ప్రభావంతో స్తంభించిన గన్నవరం ఎయిర్ పోర్టు

Satyam News

పరారీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి

Satyam News

ఎస్పీ ఆదేశాలతో నైట్ రౌండ్స్ కు పోలీసు అధికారులు

Satyam News

10వ తరగతి కూడా పాస్ కాని ఉన్నతాధికారి….?

Satyam News

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కవిత ఫైర్

Satyam News

అయోధ్య రామమందిర విరాళాల చోరీ: 150 మంది దొంగలు?

Satyam News

Leave a Comment