పల్నాడు జిల్లా నరసరావుపేట అంజుమన్ కాంప్లెక్స్ షాపుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై రిలే నిరాహార దీక్షలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి హెచ్చరించారు. 2018 నుంచి ఉపాధి కోల్పోయిన 72 మంది పాత వ్యాపారులకే ప్రాధాన్యతనిస్తూ షాపులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అక్రమ కేటాయింపులపై స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని, అంజుమన్ ఆస్తుల విషయంలో వ్యక్తిగత జోక్యం చెల్లదని స్పష్టం చేశారు. నరసరావుపేట మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న జామియా మసీదు, అంజుమన్ కాంప్లెక్స్ వక్ఫ్ బోర్డుకు చెందినస్థలమని చెప్పారు. 2018 లో అప్పటి టిడిపి ప్రభుత్వం పాత షాపుల ప్రాంతంలో నూతనంగా షాపులను నిర్మించి ఇస్తామని కూల్చి వేయడం జరిగిందన్నారు.
అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక కన్స్ట్రక్షన్ కమిటీ ని ఏర్పాటు చేసి 72 షాపులు నిర్మించేందుకు అనుమతులు తీసుకువచ్చామని చెప్పారు. 2022లో వక్ఫ్ బోర్డు సీఈఓ దగ్గర్నుంచి ఆర్డర్ కాపీ కూడా తీసుకువచ్చామని చూపించారు. 72 షాపుల వారినుంచి రూ. 2 లక్షలు చొప్పున తీసుకొని మిగతా మొత్తము వక్ఫ్ బోర్డు వేసుకుని కన్స్ట్రక్షన్ నిర్మించేందుకు ఏర్పాట్లు జరిగాయన్నారు.
కన్స్ట్రక్షన్ అయిన తరువాత షాపుల వాడికి మరల ఒక లక్ష రూపాయలు రిఫండ్ చేసేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఆ సమయంలో టిడిపికి చెందిన కొండలు మైనార్టీ నాయకులు కోర్టుకు వేసి కన్స్ట్రక్షన్ ఆపారని చెప్పారు. ఇప్పుడు అంజుమన్ కమిటీ చైర్మన్ రహమత్ అలీ, తానే మత్తవల్లిని అని తన కింద 26 షాపులు ఉన్నాయని చెబుతున్నాడని అన్నారు.
అతనే అహలే సున్నత్ జామియా మసీద్ సంఘం అని ఓ సంఘాన్ని ఏర్పాటు చేయించి, అందులో అతని కుటుంబ సభ్యులను చేర్చి రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఆ 26 షాపులు కేటాయించే బాధ్యత తనదేనని, అందులో నాలుగు షాపులను 9 లక్షల చొప్పున (రూ.36 లక్షలు) అమ్ముకున్నాడని ఆలోచించాడు అంతేకాకుండా షాపులు కట్టడానికి ఫస్ట్ ఫ్లోర్ పర్మిషన్ లేకపోయినా సరే కొంతమంది లాయర్ల దగ్గర కొంతమొత్త షాపులు కేత ఇస్తానని కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని చెప్పారు.
ఈ విషయమే జిల్లా కలెక్టర్ కు, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కు కూడా కంప్లైంట్ చేశామని చెప్పారు. దీనిపై స్పందించిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ తనకు తెలియకుండా ఇంత జరుగుతుందా అని గత రెండు వారాల క్రితం ఒక రిపోర్టు ఇచ్చారని చెప్పారు. దీనిపై కోర్టు స్టే ఆర్డర్స్, షోకాజ్ నోటీసు ఇచ్చిందన్నారు. ఐనా, కూడా ఆ నోటీసులకు వివరణ ఇవ్వకుండా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.
కేవలం షాపులను ఇష్టమైన వారికి, వారి ఇష్టమైన రేటుకు అమ్ముకోవటం కోసం, వారి స్వలాభం కోసమే చేస్తున్నారని విమర్శించారు. షాపుల కన్స్ట్రక్షన్ ఆపటం తమ ఉద్దేశం కాదని, మొదటి నుంచి ఉన్న 72 షాపుల వారికి మొదటగా షాప్ లను కేటాయించే చేయాలని డిమాండ్ చేశారు.
అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన షాపుల కేటాయింపు నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇదేమైనా అతని సొంత ప్రాపర్టీనా అని అడిగారు. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఏం చేస్తున్నారన్నారు. ఈ నూతన సంఘం ఎమ్మెల్యే పేరుతో కూడా చందాలు వసూలు చేసి, చలానాలను అందజేయడం ఘోరం అన్నారు.
ప్రతి షాపు వారి నుంచి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలు వసూలు చేశారన్నారు. 72 మందికి షాపులు కచ్చితంగా కేటాయించాలని ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు దీనికోసం కోర్టు కైనా వెళ్తామని, రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
