సంపాదకీయంహోమ్

తిరుమల ల్యాబ్ పై రాజకీయం మొదలెట్టిన వైసీపీ

తిరుమలలో రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ను ప్రారంభించడం తో శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ జరిగే అవకాశం పూర్తిగా లేకుండా పోయింది. అయితే వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ఈ ల్యాబ్ ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేస్తున్నారని ఒకవర్గంమీడియా ప్రచారంప్రారంభించింది.

దీంతో తిరుమలలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్ ఏర్పాటు పై మళ్ళీవైసీపీ రాజకీయం మొదలుపెట్టినట్లుఅయింది. 2023లో ‘ల్యాబ్ పెడదాం’ అని ఒక మీటింగ్ పెట్టుకోవడం ఒకటయితే.. 2024లో అడ్డగోలుగా నెయ్యి కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన SIT మొట్టికాయలు వేసిన తర్వాత, కళ్లు తెరిచి, కోట్లు ఖర్చు పెట్టి, విదేశీ టెక్నాలజీ తెచ్చి, బిల్డింగ్ కడితే.. “అబ్బే.. ఆ స్కెచ్ మాదే” అనడం భలే తమాషాగా ఉంది.

సాక్షి చెప్పినట్లు జగన్ హయాంలో ల్యాబ్ గురించి “చర్చలు” జరుగుతున్నప్పుడే.. కింద వంటశాలలో మాత్రం 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి ప్రవహించిందని SIT తేల్చి చెప్పింది. అంటే, అప్పట్లో ల్యాబ్ కేవలం “మనసులో” ఉంది, కానీ కల్తీ నెయ్యి మాత్రం “లడ్డూల” మీద ఉంది అనుకోవాల్సి వస్తుంది. ఎవరి వాదన ఎలావున్నా ఈ అధునాతన ల్యాబ్ మాత్రం చంద్రబాబు తెచ్చిందే.

చంద్రబాబు ‘హైటెక్’ కఠిన ఆదేశాలు

చంద్రబాబు నాలుగోసారి సీఎం గా వచ్చాక సీన్ మారింది. కేవలం ల్యాబ్ కాదు, అడ్డగోలు కల్తీని అరికట్టే “డిజిటల్ డిటెక్టివ్‌లను” రంగంలోకి దించారు. e-Nose & e-Tongue: ప్రసాదం సువాసనలో ఏమాత్రం తేడా వచ్చినా ఈ ఎలక్ట్రానిక్ ముక్కు కనిపెట్టేస్తుంది. అంటే.. ఇకపై “రాజకీయ వాసనలు” కాకుండా కేవలం “శుద్ధమైన నెయ్యి వాసన” మాత్రమే భక్తులకు దక్కుతుంది.

“నాణ్యతలో రాజీ పడితే బ్లాక్ లిస్టే!” అని సీఎం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గతంలో లాగా “నేతిలో పామాయిల్” కలిపే బ్యాచ్ కి ఇక తిరుమల కొండ మీద నో ఎంట్రీ.

చంద్రబాబు హయాంలో ఆ నిర్మాణం చేసి, టెక్నాలజీని జోడించి, రిబ్బన్ కట్ చేశారు. భక్తుడికి కావాల్సింది స్వచ్ఛమైన లడ్డూ.. కానీ సాక్షికి కావాల్సింది మాత్రం టీవీ స్క్రీన్ మీద పడే “క్రెడిట్” స్క్రోలింగ్ మాత్రమే!

కల్తీ రిపోర్ట్ వచ్చినా చర్యలు తీసుకోక దాచి పెట్టిన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డినీ.. వెనకేసుకు వచ్చే వైకాపాకు సిగ్గా.. ఎగ్గా?

Related posts

ఉత్తరకాశీ జలఉత్పాతానికి కారణం ఏమిటి?

Satyam News

జగన్ చెంప చెళ్ళుమనిపించిన కేంద్రం

Satyam News

కల్తీ మద్యం కట్టడికి “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్

Satyam News

నయనతార కు భర్త అంటే ఎంత ప్రేమో

Satyam News

‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్

Satyam News

ఇంకా బలంగానే ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాదులు

Satyam News

Leave a Comment