సినిమాహోమ్

జన నాయగన్ నా ఆఖరి చిత్రం

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ తన సినీ ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ చిత్రమే తన కెరీర్‌లో చివరి సినిమా అని ఆయన స్పష్టం చేశారు.

మలేషియాలో శనివారం (డిసెంబర్ 27, 2025) అత్యంత వైభవంగా జరిగిన ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకలో విజయ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. సుమారు 30 ఏళ్ల పాటు తనను ఆదరించి, అగ్ర కథానాయకుడిగా నిలబెట్టిన అభిమానుల కోసం ఇకపై పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని ఆయన తెలిపారు.

“ఇంతకాలం నన్ను వెండితెరపై చూసి ఆదరించారు. ఇకపై మరో 30 ఏళ్ల పాటు మీ కోసం, మీకు సేవ చేసేందుకు రాజకీయ క్షేత్రంలో ఒక సామాన్య సేవకుడిగా మీ ముందు నిలబడతాను” అని విజయ్ ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘జన నాయగన్’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమా అనంతరం విజయ్ పూర్తిస్థాయిలో తన పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించి, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కానున్నారు. సినిమాలకు స్వస్తి పలికి ప్రజా సేవలోకి వస్తున్న తన అభిమాన హీరో నిర్ణయానికి అభిమానులు భారీ స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు.

Related posts

బాక్సైట్ తవ్వకాలపై ప్రజా ప్రతినిధుల ఆగ్రహం

Satyam News

భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

Satyam News

రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు

Satyam News

లీక్ వీరులకు షాక్: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు

Satyam News

తిరుమలలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

Satyam News

క్లిష్ట సమయంలో కుటుంబం నుంచే మద్దతు రాలేదు

Satyam News

Leave a Comment