ప్రత్యేకంహోమ్

రోజు రోజుకూ పెరుగుతున్న ‘తాగుడు’ ఆదాయం

#Bar

రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం రికార్డుగా చెప్పుకోవచ్చు.

2018-19 అర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖకు రూ.20,859 కోట్ల ఆదాయం రాగా ఈ ఆదాయం ఏడు సంవత్సరాల్లో 2025‘26 నాటికి రూ. 40.209 కోట్లకు చేరుకుంది. 2024-25 అర్ధిక సంవత్సరంలో రూ.37,487 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా రాగా, 2025-26లో గత సంవత్సరంతో పోలిస్తే రూ.2722 కోట్ల మద్యం అమ్మకాలు అదనంగా పెరిగాయి.

గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 7 శాతంగా మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.2025-26 అర్థిక సంవత్సరంలో 382.91లక్షల కేసుల లిక్కర్, 387.34 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.2025-26 అర్థిక సంవత్సరంలో 2 శాతం లిక్కర్ అమ్మకాలు  పెరగ్గా , బీరు అమ్మకాలు 9 శాతం తగ్గాయి. 2024-25 అర్థిక సంవత్సరంలో 372.25 లక్షల కేసుల లిక్కర్, 536.13 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం తో పోలిస్తే బీరు అమ్మకాలు తగ్గాయి, లిక్కర్ అమ్మకాలు కాస్త పెరిగాయి.

ఏప్రిల్‌లో రూ.3272 కోట్లు, మేలో రూ.3561 కోట్లు, జూన్‌లో రూ. 3273, జూలైలో రూ.3320 కోట్లు, ఆగస్టులో రూ. 3082 కోట్లు సెప్టెంబరులో రూ.3048 కోట్లు, ఆక్టోబర్‌లో రూ.2709 కోట్లు నవంబర్‌లో రూ.2868 కోట్లు , డిసెంబరులో రూ.5,051 కోట్లు, 2026 జనవరిలో రూ.3325 కోట్లు, ఫిబవ్రరి రూ.3208 కోట్లు, మార్చి 31 రూ.3486 కోట్లు మొత్తంగా రూ. 40,209 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.ఎక్సైజ్‌శాఖకు 2620 ఏ -4 మద్యం షాపుల ద్వారా సంవత్సరానికి రెంటల్ ఫీజ్ ద్వారా రూ. 1771 కోట్ల ఆదాయం సమకూరింది. 1214 బార్ల ద్వారా రూ. 549 కోట్ల ఆదాయం వస్తుంది. 2025-26 అర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు 95,628 దరఖాస్తుల ద్వారా రూ. 2869 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పుష్కర కాలంగా ఎక్సైజ్‌శాఖకు అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. 2015-16లో రూ. 12,706 కోట్లు, 2016-17లో రూ. 14.184 కోట్లు, 2017-18లో రూ.17,597 కోట్లు, 2018-19లో రూ.20,859 కోట్లు, 2019-20లో రూ.22,605 కోట్లు, 2020-21లో రూ.27,286 కోట్లు 2021-22లో రూ.30,783 కోట్లు , 2022-23లో రూ. 35,145 కోట్లు , 2023-24లో రూ.37,675 కోట్లు , 2024‘25లో రూ.37,488 కోట్లు 2025‘26లో రూ. 40,209 కోట్ల ఆదాయం వచ్చింది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు

2025 ఏప్రిల్ లో రూ. 3,272 కోట్లు, మే రూ. 3,561 కోట్లు, జూన్ రూ. 3,273 కోట్లు, జూలై రూ. 3,320 కోట్లు, ఆగస్టు రూ. 3,082 కోట్ల, సెప్టెంబర్ రూ. 3,048 కోట్లు, అక్టోబర్ రూ. 2,709 కోట్లు, నవంబర్ రూ. 2,868 కోట్లు, డిసెంబర్ రూ. 5,051 కోట్లు,

2026 జనవరి రూ. 3,325 కోట్లు, ఫిబ్రవరి… రూ. 3,208 కోట్లు, మార్చి… రూ. 3,486 కోట్లని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Related posts

విశాఖలో కొట్టుకుపోయిన విదేశీయులు

Satyam News

రోడ్లు సూపర్ – అమరావతి అదుర్స్‌..!

Satyam News

‘తలసేమియా వ్యాధిపై’ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

Satyam News

వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam News

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

Satyam News

సునీతకు తీరని అన్యాయం చేసిన జగన్

Satyam News

Leave a Comment