ముఖ్యంశాలుహోమ్

విశాఖ సదస్సుకు అమిత్ షా ఎందుకు రావడం లేదు?

#AmitShah

సాగరతీరం విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సందడి. అందరి కళ్లూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక కోసమే. కానీ చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. కేంద్ర హోంశాఖ చెప్పింది ఒక్క మాటే: “అనివార్య కారణాలు.” అయితే ఆ కారణం వెనుక దక్షిణ కాశ్మీర్ నుంచి వచ్చిన వార్తే ఉందని భావిస్తున్నారు.

బుధవారం (నవంబర్ 11) మధ్యాహ్నం 2:15 గంటలకు కుల్గామ్ జిల్లా ఆఖ్రాన్‌లో, మీర్ బజార్ సమీపంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్ వద్ద బైక్‌పై వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కేవలం 15 సెకన్లలోనే సుమారు 30 రౌండ్లు పేల్చారని సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. ఈ దాడిలో రాకేష్ దాస్, సంతోష్ చంద్రు, సోమ్‌వీర్ సింగ్ అనే ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతనాగ్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడినట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీలో అత్యవసర సమీక్ష

దాడి వార్త తెలియగానే ఢిల్లీలో హోంశాఖ ఉన్నతాధికారులతో అత్యవసర భద్రతా సమీక్షలు మొదలయ్యాయి. పరిస్థితిని నేరుగా పర్యవేక్షించేందుకే షా విశాఖ ప్రయాణాన్ని రద్దుచేసుకున్నట్లు సమాచారం. షా బదులు, సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సదస్సును ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

Related posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ….. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌

Satyam News

ఆందోల్ రైతులకు సింగూర్ నీళ్లిస్తారా? లేక నష్టపరిహారం చెల్లిస్తారా?

Satyam News

నిర్మానుష్యం గా మారిన కుబేరుల స్వర్గం

Satyam News

U Turn: మళ్లీ మాట మార్చిన అమెరికా అధ్యక్షుడు

Satyam News

కూతురి నిశ్చితార్థంకు పార్టీ చొక్కాతో కన్నతండ్రి!

Satyam News

అమరావతిలో ఆసుపత్రులకు భారీ రాయితీ

Satyam News

Leave a Comment