ఆధ్యాత్మికంహోమ్

శ్రీశైలం లో కార్తీకమాసోత్సవాలు ప్రారంభం

#SrisailamTemple

శ్రీశైలం లో కార్తీకమాసోత్సవాలు  ప్రారంభమైనట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలమహాక్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా భక్తులు స్వామివారికి అభిషేకాలను జరిపించుకునేందుకు వీలుగా పంచమఠాలలో ఆర్జిత అభిషేకాన్ని  ప్రారంభించడం జరిగిందన్నారు.

భక్తులు కేవలం రూ. 216/-ల రుసుముతో  ఒక టికెట్ పై దంపతులు లేదా ఒకరు  అభిషేకాన్ని నిర్వహించుకోవచ్చునని అన్నారు.  ఈ ఆర్జిత అభిషేక టికెట్లను మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 మరియు ఏ.పి.టి.ఎస్ వారి వెబ్‌సైట్ www.tms.ap.gov.in ద్వారా పొందవచ్చునని అన్నారు.  అభిషేకానికి అవసరమైన పూజాసామాగ్రిని దేవస్థానం సమకూరుస్తుందని తెలిపారు. భక్తులు వారి అభీష్టం మేరకు పంచమఠాలుగా ప్రసిద్ధమైన  ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలోని ఏదైనా ఒకమఠంలో ఈ ఆర్జిత అభిషేకాన్ని జరిపించుకోవచ్చునని అన్నారు.

ఈ రోజు పలువురు భక్తులు ఈ అభిషేకాలను జరిపించుకున్నారని తెలిపారు. ఈ రోజు ఉదయం వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంత్రం గం. 4.00ల వరకు దర్శనాలను ఏర్పాటు చేశామన్నారు.

అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి దర్శనాలు ప్రారంభించడం జరిగిందన్నారు. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని నిర్ధిష్టవేళలో శ్రీస్వామివార్ల స్పర్శదర్శనానికి  5 విడతలుగా భక్తులను అనుమతించినట్లు వారు పేర్కొన్నారు.

క్యూలైన్లలో అల్పాహారం

కార్తీకమాసమంతా క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారంగా కట్టుపొంగలి, పులిహోర మరియు మంచినీరు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ రోజు  ఉదయం వేళలలో  బిస్కెట్లు, వేడిపాలు కూడా అందించబడ్డాయని  అన్నారు.

భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి మరియు గంగాధరమండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయన్నారు.  అదేవిధంగా గంగాధర మండపం వద్ద పలువురు భక్తులు దీపారాధన చేసుకోవడం జరిగిందన్నారు. భక్తులకు అన్నప్రసాదవితరణ భవనంలో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేయబడుతున్నాయని తెలిపారు. . అలాగే సాయంత్రం గం. 7.00 నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడుతుందన్నారు.

కార్తీకమాసంలో భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని 10 కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలు అందజేయబడుతున్నాయని అన్నారు.

Related posts

సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

Satyam News

నేడు పవిత్ర భీష్మ ఏకాదశి

Satyam News

ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖ

Satyam News

బ్రెజిల్ లో లిథియం మైనింగ్ కి సింగరేణి

Satyam News

శ్రీ కంచి కామకోటి పీఠం విద్యాసంస్థల అడ్మిషన్లు ప్రారంభం

Satyam News

ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

Satyam News

Leave a Comment