మహబూబ్ నగర్హోమ్

పేదల తిరుపతి ఆలయ పునర్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

#Kodangal

పేదల తిరుపతిగా ఖ్యాతి పొందిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేదపండితుల సమక్షంలో నిర్వహించిన భూమి పూజ, యాగంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణంతో పాటు కొడంగల్ లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం

Satyam News

ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా కలెక్టర్ సేవలు ప్రశంసనీయం

Satyam News

ధర్మం మంటగలిస్తే… ఆ త్రికూటేశ్వరుడు కన్నెర్ర చేయడా?

Satyam News

వీరబైరాన్‌పల్లి పోరాట ఘట్టం భావితరాలకు స్ఫూర్తి

Satyam News

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభవార్త

Satyam News

ప్రజాకవి కాళోజీ యాదిలో ‘తెలంగాణ భాషా దినోత్సవం’

Satyam News

Leave a Comment