హైదరాబాద్హోమ్

ఘనంగా హైదరాబాద్ సిటీ పోలీసుల హోలీ వేడుకలు

హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో పెట్లబుర్జులోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (CAR) ప్రధాన కార్యాలయంలో శనివారం హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమై, పండుగల సమయంలోనూ బందోబస్తు విధుల్లో ఉంటూ తీరిక లేకుండా గడిపే పోలీస్ సిబ్బందికి మానసిక ఉల్లాసాన్ని, పునరుత్తేజాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున హోలీ వేడుకలను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ వేడుకలకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అత్యవసర విధుల కారణంగా పండుగలకు తమ కుటుంబాలకు దూరంగా ఉండే పోలీసులకు ఇలాంటి వేడుకలు ఎంతో ఊరటనిస్తాయని కమిషనర్ పేర్కొన్నారు. పండుగ పూట కనిపించిన ఇదే ఉత్సాహాన్ని విధుల్లోనూ ప్రదర్శిస్తూ, ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేసి విభాగానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సిబ్బందికి పిలుపునిచ్చారు.

వేడుకల్లో భాగంగా సీనియర్ అధికారులు తమ హోదాలను పక్కన పెట్టి కింది స్థాయి సిబ్బందితో కలిసి రంగులు పూసుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమం పోలీస్ శాఖలోని ఐక్యతను, సోదరభావాన్ని చాటిచెప్పింది. ఈ వేడుకల్లో జాయింట్ సీపీ శ్వేతతో పాటు డీసీపీలు కిరణ్ ప్రభాకర్, రక్షిత కె. మూర్తి, శిల్పవల్లి, చైతన్య కుమార్, కాజల్, చంద్రమోహన్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, లావణ్య నాయక్, వెంకటలక్ష్మి, రమణారెడ్డి, అరవింద్ బాబు మరియు పెద్ద సంఖ్యలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

Satyam News

ట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనం ఎందుకు?

Satyam News

గోదావరి పుష్కరాల నాటికి భద్రాద్రి వైభవం!

Satyam News

Vijay Effect: నిట్టనిలువుగా చీలిపోయిన ఏఐఏడిఎంకే

Satyam News

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప

Satyam News

తదుపరి సీఎస్ ఎవరు?

Satyam News

Leave a Comment