ముఖ్యంశాలుహోమ్

సీఎం చంద్రబాబుతో జపాన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ భేటీ

#Japan

ఆంధ్రప్రదేశ్ లో జపాన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు ఆ దేశ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని జపాన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ కెంజీ హిరమత్సూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. అనంతపురం లేదా విశాఖ వద్ద ఈ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు తమ కంపెనీలు ముందుకు వస్తాయని వెల్లడించారు.

ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రీసెర్చితో కలిసి జేఆర్ఐ పనిచేస్తోందని తెలిపారు. వాణిజ్యం లాజిస్టిక్స్ రంగాల్లో జపాన్ -ఇండియా వ్యూహాత్మక ఆర్ధిక భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వివరించారు. వంద బిలియన్ డాలర్ల విలువైన ఢిల్లీ- ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లో జపాన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ చొరవతోనే జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు సీఎంకు తెలిపారు.

ఏపీలో విజయవంతమైన శ్రీసిటీ సెజ్ మోడల్ లోనే పారిశ్రామిక క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కెంజీ స్పష్టం చేశారు. మారిటైమ్ అభివృద్ధిలో భాగంగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ల లాంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఆసక్తిగా ఉన్నట్టు వివరించారు.

ఇన్వెస్టర్ రెడీ ఇండస్ట్రియల్ బ్లూ ప్రింట్స్ రూపకల్పనలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు జేఆర్ఐ  సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. త్వరలోనే అమరావతిలో ఏపీ- జపాన్ బిజినెస్ సమ్మిట్ ను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తు్న్నట్టు కెంజీ హిరమిత్సు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం జపాన్ భాగస్వామ్యంతో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని.. రాష్ట్రంలోని అవకాశాలు, వనరులను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Related posts

దేశ ఆహార శుద్ధి రంగంలో 9% వాటాతో ఏపీ నంబర్ వన్

Satyam News

రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా కృషి: లింగమనేని రమేష్

Satyam News

వైభవోపేతంగా తిరుమల శ్రీవారి చక్రస్నానం

Satyam News

రొట్టెల పండగకు తొలిరోజు భక్తుల రద్దీ

Satyam News

ఇరాన్ కు మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Satyam News

అల్లుడు తో రాసలీలలు సాగిస్తూ….

Satyam News

Leave a Comment