ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని వ్యవస్థీకృతంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు 1970వ దశకంలో ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా 1976 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఏపీ టి డి సి) ఏర్పాటైంది. తొలుత ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనుబంధ సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ, అనంతరం 1980 మార్చిలో ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గా ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం, పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పర్యాటక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. కాలక్రమేణా వసతి గృహాలు, రెస్టారెంట్లు, బోటింగ్, క్రూయిజ్ ప్రయాణాలు, పర్యాటక రవాణా తదితర సేవలను కూడా సంస్థ విస్తరించింది.కాలక్రమేణా వసతి గృహాలు, రెస్టారెంట్లు, బోటింగ్, క్రూయిజ్ ప్రయాణాలు, పర్యాటక రవాణా తదితర సేవలను కూడా సంస్థ విస్తరించింది. ఈ క్రమంలోనే హరిత హోటళ్లు, హరిత రిసార్టులు ప్రభుత్వ పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి.
బాపట్ల సూర్యలంక బీచ్ ను గోవా తరహాలో పర్యాటకులను ఆకర్షించే విధంగా జరుగుతున్న అభివృద్ధి పనులు నత్త నడక జరుగుతున్నాయి. సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు బాలారిష్టాలు దాటడం లేదు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద సూర్యలంక బీచ్ ను అభివృద్ధి చేసేందుకు రూ 97.52 కోట్లు నిధులు మంజూరు చేసింది.
బీచ్ అభివృద్ధికి 20 ఎకరాల భూమి కేటాయింపు…
సూర్యలంక బీచ్ ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సూర్యలంక సముద్రపు ఒడ్డున కేటాయించింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ పర్యవేక్షణలో సూర్యలంక బీచ్ పనులు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో గోవాకు మించి సూర్యలంక బీచ్ ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా చేసుకొని పూర్తి సహకారం అందిస్తున్నారు. అయితే సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులకు అవసరమైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అనుమతులు, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అనుమతులు ఇప్పటివరకు రాకపోవటంతో బీచ్ అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుంది.
డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించాలి
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సెప్టెంబర్ నెల లోగా సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. అయితే పనులు పూర్తి కాకపోవటంతో ఈనెల 24వ తేదీలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సంబంధిత ఏపీ టూరిజం కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద రూ 13.50 కోట్లతో అండ్ విజిటర్ అండ్ విజిటర్ ఎక్స్పీరియన్స్ ఎన్ హాండ్స్ మెంట్ పనులకు నిధులు కేటాయించారు. 4. 37 కోట్లతో షాపింగ్ స్ట్రీట్ డెవలప్మెంట్ పనులకు నిధులు మంజూరు చేశారు. రూ 7.76 కోట్లతో విజిటర్ అండ్ పార్కింగ్ సస్టైనబుల్ మొబిలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించారు. రూ10.47 కోట్లు ఎమినిట్స్ అండ్ బీచ్ సైడ్ సర్వీసెస్ కేటాయించారు.
రూ 5. 92 కోట్లతో ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యుటిలిటీ ఇటిలిటీ కోసం నిధులు మంజూరు చేశారు. రూ 18.77 కోట్లు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ అభివృద్ధికి నిధులు కేటాయింపులు చేశారు. కాగా రూ 11.59 తో కెనాల్ ఎక్స్పీరియన్స్ డెవలప్మెంట్ పనులు నత్తనడకన జరుగుతున్నాయి.
కేవలం 0.20 శాతం మాత్రమే పనులు జరిగాయి. సూర్యలంక బీచ్ అభివృద్ధి మొత్తం పనులు ఇప్పటివరకు 40 శాతం పూర్తయ్యాయి.ఇప్పటివరకు సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు సుమారు రూ 25 కోట్ల రూపాయల వరకు జరిగాయి. బీచ్ సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు డిసెంబర్ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు ఇంజనీరింగ్ అధికారులు విన్నవించారు.
