సినిమాహోమ్

కళా భూమి యుగాది పురస్కారానికి పీసీ ఆదిత్య ఎంపిక…

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళా సాంసృతిక సంస్థ కళా భూమి, బెంగళూరు వారు ప్రతి యేటా అందించే యుగాది పురస్కారాలుకు ఈ సంవత్సరం కూడా పలు రంగాలకు చెందిన నిష్ణాతులను ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుండి సినీ రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు, నిత్య ప్రయోగశీలి డా. పీసీ ఆదిత్య ను కళా భూమి యుగాది పురస్కారానికి ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షులు ఆస్కార్ కృష్ణ తెలియజేసారు…

ఈ నెల 16 వ తేదీన బెంగళూరు లోని కళా గ్రామ ప్రాంగణంలో యుగాది పురస్కారాలు అందజేస్తామని అన్నారు.. తెలుగు సినీ రంగం లో గత 30 సంవత్సరాలనుండి పలు ప్రయోగాలు చేస్తూ నిత్య ప్రయోగశీలి గా పేరొందిన, సినీ శ్రామికుడు ఆదిత్య గారిని తమ కళా భూమి యుగాది పురస్కారానికి ఎంపిక చేయడం తమ సంస్థ కు ఎంతో గర్వంగా ఉందని ఆస్కార్ కృష్ణ అన్నారు..

ఈ సందర్బంగా పీసీ ఆదిత్య స్పందిస్తూ తన సుధీర్ఘ సినీ ప్రయాణం లో ఎన్నో అవార్డులు రికార్డులు అందుకున్నా, నేడు ప్రతిష్టాత్మక కళా భూమి యుగాది పురాస్కారానికి ఎంపిక కావడం ఎంతో ఆనందం గా ఉందని, ఈ స్ఫూర్తితో భవిష్యత్ లో మరికొంత మంది నూతన కళాకారులకు అవకాశం ఇస్తానని అన్నారు.. ఈ సందర్బంగా పీసీ ఆదిత్య కు ఆయన అభిమానులు, మిత్రులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసారు.

Related posts

సిరిసిల్ల వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలించిన కేటీఆర్

Satyam News

పోలవరం ప్రాజెక్టు సందర్శించిన రాష్ట్ర గవర్నర్

Satyam News

కన్నడ స్టార్ విజయ్ రాఘవేంద్ర హీరోగా సంజీవ్ మేగోటి ఆన్ డ్యూటీ

Satyam News

విజయనగరం లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Satyam News

అన్నీ అపోహలే: కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ

Satyam News

వెలుగుమట్ల బాధితుల కోసం కొనసాగుతున్న దీక్ష

Satyam News

Leave a Comment