అనంతపురంహోమ్

రాప్తాడు హేమంత్ కు తీవ్ర అస్వస్థత

#crime

అనంతపురం జిల్లా రాప్తాడులోని స్కూల్ లో బాలికపై రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అధికారులు అతడిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రి నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

అతనికి పల్మనరీ ఎంబాలిజం సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రెండు రోజుల క్రితం అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వైద్యులు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. గత 13 రోజులుగా హేమంత్ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు.

రాప్తాడులో బాలికపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో నిందితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తి నెలకొంది.

Related posts

కాకినాడలో “స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర”

Satyam News

కల్వకుంట్ల కవితకు డిపాజిట్లు కూడా రావు

Satyam News

గంజాయి కేసులో వైసీపీ లీడర్ కామాక్షి అరెస్ట్!

Satyam News

బడ్జెట్ ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Satyam News

రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ మృతి

Satyam News

ముందు నేను మాట్లాడతా… వద్దు రాము, చివరి అవకాశం నీదే!

Satyam News

Leave a Comment