ప్రత్యేకంహోమ్

సైకోలకు షాక్ ట్రీట్‌మెంట్: రంగంలోకి సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్!

#CBN

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ సాకుతో సోషల్‌మీడియా, యూట్యూబ్‌లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అరాచకవాదుల ఆట కట్టించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతనజరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై సీరియస్ చర్చ జరిగింది. సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తూ, కుటుంబాలను టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్, రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ మీడియా అరాచకాలపై DGP సమగ్ర నివేదికను కేబినెట్ ముందు ఉంచారు. ఇటీవల అరెస్ట్ అయిన జోసఫ్ రావణ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు, వ్యవస్థీకృత గ్రూపులు పనిగట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న తీరును డిజిటల్ ఆధారాలతో సహా వివరించారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా..కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అత్యంత వ్యూహాత్మకంగా విద్వేషాన్ని నూరిపోస్తున్నారని నివేదికలో వివరించారు..

డిజిటల్ వేదికలపై నిరంతరం సమాజాన్ని కలుషితం చేసే ఇటువంటి అరాచక శక్తులకు చట్టం పవర్ చూపించాల్సిందేనని మంత్రులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. సోషల్ మీడియా నేరగాళ్లపై నమోదవుతున్న కేసులను కోర్టుల్లో బలంగా వాదించడానికి, నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చేయడానికి ప్రత్యేకంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైబర్ క్రైమ్ చట్టాలను మరింత కఠినంగా అమలు చేస్తూ, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరిపించేలా న్యాయపరమైన మౌలిక వసతులను బలోపేతం చేయాలని ఐటీ, హోంశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇకపై సోషల్ మీడియాలో ఫేక్ ఐడీల వెనుక దాక్కుని వికృతానందం పొందే సైకో బ్యాచ్‌కు, కేవలం చీప్ పాపులారిటీ కోసం బూతులు తిడుతూ రెచ్చిపోయే వారికి ఈ టాస్క్‌ఫోర్స్ గట్టి షాక్ ట్రీట్‌మెంట్‌ కానుంది. ఒక్కసారి తప్పు చేస్తే.. మళ్లీ జీవితంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపు చూడాలన్నా వణకాల్సిందే అనేలా కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు పడేలా ఈ లీగల్ యాక్షన్ ప్లాన్ డిజైన్ చేశారు. రాజకీయ విమర్శల పేరిట సాగుతున్న మార్ఫింగ్ దందాలకు, బూతుల సంస్కృతికి శాశ్వతంగా ముగింపు పలికి..రాష్ట్రంలో మళ్లీ ఒక ఆరోగ్యకరమైన, సంస్కారవంతమైన డిజిటల్ వాతావరణాన్ని తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ భారీ ప్రక్షాళనకు నడుం బిగించింది.

Related posts

అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి

Satyam News

గృహ ప్రవేశం లో గుండె పోటు… సో.. శాడ్

Satyam News

మత్స్యకార గ్రామంలో నిదురించనున్న కేంద్ర మంత్రి

Satyam News

గడ్చిరోలిలో మళ్లీ కనిపించిన మావోల కదలికలు

Satyam News

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

Satyam News

వంట గ్యాస్ బుకింగ్ పేరుతో మోసం

Satyam News

Leave a Comment