సంపాదకీయంహోమ్

స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్..  వైసీపీకి ఎదురుదెబ్బ.!

#Jagan

ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలని చూసిన వైసీపీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్ ప్రక్రియ తరువాతే స్థానిక ఎన్నికలు జరపాలన్న వైసీపీ వాదనను తోసిపుచ్చింది. ఎన్నికలకు ఆటంకం కలిగించడమంటే ప్రజాప్రయోజనాలను అడ్డుకోవడమేనని వైసీపీపై సీరియస్ అయింది. ఈ విషయమై వైసీపీ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.

ఏపీ ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ హైకోర్టు సూచనల మేరకు ఆరు వారాల్లోపు నోటిఫికేషన్‌కు సిద్ధమని పేర్కొంది. ఆ లోపు SIR ‌పూర్తి అయితే కొత్త జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. లేని పక్షంలో పాత జాబితాతోనే ముందుకెళ్లాలని సూచించింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది.

మొత్తంగా ఎన్నికలకు ఎలాగైనా అడ్డుకునేందుకు వైసీపీ వేసిన ఎత్తులన్ని చిత్తయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 24%కి తగ్గించి ద్రోహం చేసిన వైసీపీ, నేడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అదే కుట్రబుద్ధిని చాటుకుంటోంది. సాకులు వెతుక్కుంటూ కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేసి స్థానిక ఎన్నికలను ఆపాలని, గ్రామీణాభివృద్ధికి అందాల్సిన రూ. 12,000 కోట్ల నిధులను నిలిపివేయాలని జగన్ కోటరీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే, చట్టపరమైన సందులను వాడుకుని ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయాలని చూసిన వైఎస్ఆర్సీపీ ఎత్తులన్నీ న్యాయస్థానాల ముందు చిత్తు చిత్తయ్యాయి.

సుప్రీం తీర్పుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. చట్టబద్ధమైన పరిమితులు ఎదురైనా స్వచ్ఛందంగా 34% బి-ఫామ్‌లను బీసీ నాయకులకే ఇచ్చి గెలిపించుకుంటామని ప్రకటించిన చంద్రబాబు నాయకత్వానికి ఈ తీర్పు మరింత ఊపిరిపోసింది. ఓటమి భయంతో కోర్టుల వెనుక దాక్కుంటూ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన జగన్‌కు, వైసీపీ శ్రేణులకు రాబోయే స్థానిక పోరులో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.

Related posts

ఎంపీడీఓలకు వాహనాలు అత్యవసరం: అధ్యక్షురాలు జొన్నల పద్మావతి

Satyam News

ఓటరు జాబితా సవరణకు సుప్రీంకోర్టు సపోర్టు

Satyam News

రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

Satyam News

డీఎంకే పంచన చేరిన పనీర్ సెల్వం

Satyam News

పర్యాటక రంగం అభివృద్ధితో మరింత గుర్తింపు

Satyam News

మర్డర్ కు దారితీసిన క్రికెట్ మ్యాచ్

Satyam News

Leave a Comment