26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న దళపతి విజయ్

#Vijay

రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, దళపతి విజయ్ ఎవరూ ఊహించని చిక్కుల్లో పడిపోయాడు. ఎందుకో తెలుసా? విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తమిళ సినీ పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో ఇది పెను సంచలనం రేపింది.

గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ, చెంగల్పట్టులోని ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని ఆమె తీసుకున్న ఈ నిర్ణయం విజయ్ అభిమానులను. రాజకీయ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తన పిటిషన్‌లో సంగీత విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. విజయ్‌కు ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉందని, ఆ కారణం చేతనే తాను విడాకులు కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2021లోనే ఈ విషయం తనకు తెలిసిందని, అప్పటి నుండి ఆయన మానసికంగా తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయ్ ప్రవర్తన వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని ఆమె వెల్లడించారు. తాము ప్రస్తుతం విడివిడిగానే ఉంటున్నామని, ఈ బంధాన్ని కొనసాగించడం ఇక సాధ్యం కాదని ఆమె కోర్టుకు విన్నవించారు.

విజయ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయకన్’ విడుదలలో జాప్యం జరుగుతుండటం, మరో వైపు భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడం ఆయనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

ఈ ఆరోపణలపై విజయ్ కానీ, ఆయన పార్టీ కార్యాలయం కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Related posts

కూతురి నిశ్చితార్థంకు పార్టీ చొక్కాతో కన్నతండ్రి!

Satyam News

వర్ష బాధితుల్ని పట్టించుకోని మంత్రి దామోదర

Satyam News

మరింత ప్రభావం చూపించనున్న అల్పపీడనం

Satyam News

భారీ క్షిపణి దాడులు చేసిన IRGC

Satyam News

ఎర్ర చందనం స్మగ్లర్ల వేట

Satyam News

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆగస్టు 2న

Satyam News

Leave a Comment