26.7 C
Hyderabad
September 20, 2026
విజయనగరంహోమ్

మ‌రి కొద్ది గంట‌ల‌లో విజ‌య‌గ‌న‌రం జిల్లా కు సీఎం

#ChandrababuNaidu

సీఎం చంద్ర‌బాబు రెండోసారి విజ‌య‌న‌గ‌రం జిల్లాకు అందునా ఎన్టీఆర్ భ‌రోసా ఫించ‌న్ల పంపిణీ కి రానున్నారు..ఆ పై చేయ‌నున్నారు.తొలుగు రాష్ట్ ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి  కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ నియోజ‌క వ‌ర్గ‌మైన గ‌జ‌ప‌తిన‌గ‌రంకు రాగా ఈ సారి ఈ రెండో ద‌ఫా  ఎమ్మెల్యే కిమిడి క‌ళా వెంక‌ట‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చీపుర‌ప‌ల్లి నియోజ‌క వ‌ర్గం రావివ‌ల‌స కు రానున్నారు.

స‌రిగ్గా 28వ తేదీ ఉద‌యం 11.30కి రావివ‌ల‌స గ్రామ స‌చివాల‌యానికి సీఎం చంద్ర‌బాబు చేరుకుంటారు. ఈ మేర‌కు ఐ అండ్ పీఆర్ సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నకు సంబంధించి షెడ్యూల్ విడుద‌ల చేసింది. సీఎం తన పర్యటనలో భాగంగా ఉదయం 11.10 గంటలకు రావివలస గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

అక్కడి నుండి చీపురుపల్లి  సి.హెచ్.సి కు చేరుకొని  హెచ్.పి.వి వాక్సిన్ కార్యక్రమంలో పాల్గొంటారు.  ప్రజావేదిక వద్దకు  12 గంటలకు చేరుకొని, 1 గంట వరకు ప్రధాని మోడీ  హెచ్.పి.వి వాక్సిన్  ప్రారంభోత్సవం పై నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ కు హాజరవుతారు.

ఆ తర్వాత ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. ఆ అనంతరం పైలపేట శివారు  గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్లను అందజేస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.మధ్యాహ్నం 3.15  గంటల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, సాయంత్రం 4.50 గంటలకు  రావివలస హెలిపాడ్ నుండి గన్నవరం కు తిరుగు ప్రయాణమవుతారు.

జిల్లాలో రూ. 114.83 కోట్ల పింఛన్ల పంపిణీజిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఫిబ్రవరి 28న మొత్తం 2,69,748 మందికి సుమారు రూ. 114.83 కోట్లు పంపిణీ చేయనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని మొత్తం 36,903 మందికి రూ. 15.80 కోట్లు, అలాగే చీపురుపల్లి మండలంలోని 8,431 మందికి రూ. 3.56 కోట్లు పంపిణీ చేయనున్నారు.

కేవలం రావివలస గ్రామ పంచాయతీ పరిధిలోనే 387 మందికి రూ. 16 లక్షలను అందజేస్తారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62,76,322 మందికి రూ. 2,725.79 కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల రూపంలో పంపిణీ జరుగుతుంది.

Related posts

చరిత్ర సృష్టిస్తున్న మిడ్ ఫీల్డర్ రుతుజ

Satyam News

విధి నిర్వహణలో ఉన్న అధికారిపై కండక్టర్ ‘అటాక్’

Satyam News

ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై కంటైనర్ బోల్తా

Satyam News

మాల్యవంతం వారి ఇంట అలరించిన బొమ్మలకొలువు

Satyam News

జగన్ భారతీ రెడ్డి లను విచారించాల్సిందే

Satyam News

ఎంపీడీఓలకు వాహనాలు అత్యవసరం: అధ్యక్షురాలు జొన్నల పద్మావతి

Satyam News

Leave a Comment