రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా కూడా జగన్ రెడ్డి విదేశాలకు వెళుతుండడాన్ని ఆ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారు. తన చెల్లెలు వై ఎస్ షర్మిలారెడ్డి కుమార్తె వివాహానికి హాజరు కాకుండా ఉండేందుకే జగన్ రెడ్డి ఈ ప్లాన్ వేశాడని చెబుతున్నారు.
షర్మిల కూతురు వైఎస్ అంజలి పెళ్లి కుదిరిందని తెలియగానే, పత్రిక అచ్చేయక ముందే జగన్‌కు తెలిసి సీబీఐ కోర్టులో అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 మధ్యలో కూతుళ్ల దగ్గర 15 రోజులు గడపడానికి అని అనుమతి తీసుకున్నాడు. నవంబరు 15వ తేదీన జరిగే పెళ్లికి దేశంలోనే ఉండకుండా మొహం చాటేయనున్నాడు. నవంబరు రెండో వారం చివర్లో వెళ్లి నెల ఆఖర్లో రావడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
అవతల ఆహ్వాన పత్రికలో చెల్లి వియ్యంకులు అచ్చేసిన వేదిక ఇవ్వడానికి కుదరదు అది మా అత్త పేరు మీద ఉంది, ఎందుకు ఇస్తాం అని అడ్డం తిరిగి చెల్లిని ఇంటి నుండి బయటకు వెళ్లి తలెత్తుకోకుండా చేశాడు. స్థానిక ఎన్నికల వేళ కనీసం కడప, పులివెందులను కూడా షర్మిల పట్టించుకోకుండా మానసికంగా దెబ్బకొట్టాడు.
అసలు పులివెందులలో ప్రాక్టీస్ చేసే మావయ్య గంగిరెడ్డికి బెంగుళూరులో 25 ఎకరాల ప్యాలెస్, హైదరాబాద్‌లో ఎకరాల కొద్దీ భూములు కొని, కట్టే స్తోమత ఎక్కడ నుండి వస్తుంది అని ఆలోచించకుండా ఆయన అభిమానులు ఎదురుదాడి చేస్తున్నారు.
వైఎస్ భారతితో పుట్టిన సోదరుడు ఉన్నాడు. అతనికి ఇవ్వని ఆస్తులు కూతురికి, అల్లుడికి మాత్రమే ఇచ్చారా? వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం కూతురికి ఇవ్వడా అనే ఆలోచన ఆయన అభిమానులకు అస్సలు రాదు.
హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ హౌస్ నుంచి బెంగుళూరులోని విశాలమైన యెలహంక ప్యాలెస్ వరకు ప్రతి కట్టడం వెనుక ఒక పెద్ద ‘వ్యూహం’, దానికోసం వాడిన ‘బినామీ’ తంత్రాలు అనేకం ఉన్నాయి. అందులోనూ అత్త సుగుణమ్మ, మావయ్య గంగిరెడ్డి పేరు మీద నడిచిన కథలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఒక అవినీతి పరుడు కోట్లు సంపాదించడం వేరు, ఆ సంపదనంతా ఎవరికీ కనపడకుండా బంధువుల పేరిట, చిన్న షెల్ కంపెనీల ముసుగులో దాచడం వేరు. జగన్ మోహన్ రెడ్డి ప్లానింగ్ ఎంత ఖచ్చితంగా ఉండేదంటే వ్యాపారాలు కొత్తగా పుట్టుకొస్తున్న తరుణంలోనే, కోట్ల రూపాయల లావాదేవీలు నడపడానికి భార్య వైపు కుటుంబ సభ్యులను కూడా పావులుగా వాడుకున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హుడా హైట్స్‌లో ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టడానికి ‘ఉటోపియా ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అనే కంపెనీని తెరపైకి తెచ్చారు. దీన్ని స్థాపించింది ఎవరో కాదు; జగన్ మావయ్య ఈ.సీ. గంగిరెడ్డి, పిన్ని సుగుణమ్మ, అలాగే మరో సన్నిహితుడు బి. రమేష్ బాబు. కేవలం యాభై రూపాయల ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఈ కంపెనీలోకి, ఆ తర్వాత కోట్లాది రూపాయల నిధులు పెద్ద కంపెనీల నుంచి దారి మళ్లించినవేనని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా గట్రా కూడా భార్య పేరునే పెట్టాడు.
యెలహంక ప్యాలెస్ కొనుగోలు, విలాసాలు మరియు అక్కడే ఎవరున్నారు? ఎవరి నుంచి కొన్నారు?: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో, ద్వారకా నగర్ (యెలహంక) ప్రాంతంలో ఉన్న ఈ భారీ 22-23 ఎకరాల స్థలాన్ని వైఎస్సార్ కుటుంబం ‘ఎస్.కె. నాయర్’ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది.
ప్రత్యేకతలు: చుట్టూ పచ్చని తోటలు, ఫౌంటెన్లు, మరియు అత్యంత ముఖ్యంగా సొంతంగా ఒక ప్రైవేట్ హెలిప్యాడ్ సౌకర్యం ఉన్న ఈ వంద కోట్ల విలువైన ప్రాపర్టీని అత్యంత గోప్యంగా ఉంచారు. అక్కడ వైఎస్ షర్మిల తన భర్త బ్రదర్ అనిల్, పిల్లలతో నివసించేది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడకు వచ్చేవారని, ఆ తర్వాత జగన్ వస్తే ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్‌లు అయ్యేవని కథనాలు వచ్చాయి.
సీబీఐ ఎంట్రీ: ఆ రోజుల్లోనే పెను సంచలనం!
ఈ 23 ఎకరాల విశాలమైన ఎస్టేట్‌పై సీబీఐ అధికారులు రెండు వేర్వేరు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ప్రాంగణంలో ఎవరున్నారు?: ఈ ఎస్టేట్ లోపల రెండు భారీ బంగ్లాలు ఉన్నాయి. రైడ్స్ జరిగే సమయంలో జగన్ సోదరి షర్మిల మరియు ఆమె పిల్లలు అక్కడే నివాస గృహ ప్రాంతంలో సంచరిస్తూ కనిపించారు. గేట్ల వద్ద సాయుధులైన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కాపలాగా ఉన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. అధికారులు రికార్డులు, డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించి పూర్తి స్థాయి ఇన్వెంటరీ సేకరించారు.
యెలహంక ఎస్టేట్‌పై సోదాలు జరుగుతున్న సమయంలో, మరో సీబీఐ బృందం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ‘మంత్రి డెవలపర్స్’ రికార్డులను కూడా పరిశీలించింది. వైఎస్సార్ కుటుంబానికి, మంత్రి గ్రూప్‌నకు అత్యంత సన్నిహిత వ్యాపార సంబంధాలు ఉన్నాయని, జగన్ మోహన్ రెడ్డి తమ వద్ద భారీగా పెట్టుబడులు పెట్టారనే పక్కా సమాచారంతోనే ఈ తనిఖీలు చేపట్టామని అప్పట్లో సీబీఐ అధికారులు వెల్లడించారు.
ఒకవైపు నాన్న అధికారంలో వుండగానే, మరోవైపు ఇలా ఆస్తుల సామ్రాజ్యాన్ని విస్తరించడం వెనుక పెద్ద తంతే నడిచింది. కాలక్రమేణా సీబీఐ, ఈడీ ఎంట్రీ ఇవ్వడం, బినామీ లావాదేవీలు మరియు బెంగుళూరు ప్యాలెస్‌లో దాడులు అన్నీ వెలుగులోకి రావడం ఒక వేలకోట్ల రాబరీ థ్రిల్లర్‌ను తలపించాయి. రాజకీయాల్లో ఎదిగే కొద్దీ ఆస్తుల గ్రాఫ్ ఎలా అమాంతం పెరిగిపోయిందో చెప్పడానికి ఈ యెలహంక, బంజారాహిల్స్ ఎపిసోడ్లే పెద్ద ఉదాహరణ. సుగుణమ్మ లాంటి పేర్లు కేవలం కాగితాలపై డైరెక్టర్లుగా కనిపిస్తాయేమో కానీ, ఆ వెనుక అసలు సామ్రాజ్యం నడిపింది ఎవరో అప్పుడే సీబీఐ సమాధానం చెప్పింది.
అప్పట్లో ఆ వాటాలో ఉంటున్న షర్మిలకు, బినామీగా తన అన్న తన అత్త పేరిట ఆస్తులు ఎందుకు పెడుతున్నాడో అప్పుడు ఊహించి ఉండదు. తండ్రి పోయిన తర్వాత అన్నను నమ్మింది, ఆయన కోసం పాదయాత్ర చేసింది. కానీ కాలం తీరాక… అదే అన్న తనను నట్టేట ముంచాడని, భవిష్యత్తులో ఆస్తుల వాటాలు ఎగ్గొట్టడానికే ఇదంతా చేశాడని ఆలస్యంగా గ్రహించింది.
ఆఖరికి కన్న కూతురి పెళ్లిని కూడా తన సొంత వాటాలో చేసుకోలేక, ముద్రించిన ఆహ్వాన పత్రికను చేతిలో పట్టుకుని అవమాన భారంతో కన్నీటితో తడుపుతోంది. ఇదంతా చూస్తున్న వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ… కన్న కొడుకు చేసిన అన్యాయానికి, కుటుంబంలో రగులుకున్న మంటలకు అంతులేని భాదతో కుమిలిపోతోంది. చరిత్ర ఎవరిని ఎక్కడ నిలబెడుతుందో కాలమే నిర్ణయిస్తుంది!
వైఎస్ భారతి సోదరుడు, సౌమ్యుడు పులివెందులలో చిన్న ఫార్మ్ హౌస్ మాత్రమే ఉంది. భార్య వదిలేసి అమెరికాకు వెళ్లిపోయింది అతని కాపురం కూడా నిలబెట్టలేదు బావ జగన్. వైఎస్ రాజశేఖరరెడ్డి నీడతో సహా జగన్ అంటే తోబుట్టువుల వరకు హడల్.
