ఆధ్యాత్మికంహోమ్

ఇంద్రకీలాద్రిపై భక్తులను అలరించిన ‘కూచిపూడి నృత్య ప్రదర్శన’

#Indrakeeladri

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  సాంస్కృతిక వేదిక “ధర్మపథం” కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

​విజయవాడకు చెందిన యువ కళాకారిణి కుమారి శ్రీయ బృందం సాయంత్రం 6:30 గంటల నుండి ప్రదర్శించిన కూచిపూడి నృత్య రీతులు ఆహుతులను, అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. ​ఈ కార్యక్రమంలో కుమారి శ్రీయ బృందం ప్రదర్శించిన పలు శాస్త్రీయ నృత్య రూపకాలు విశేష ప్రశంసలు పొందాయి.

​వినాయక స్తుతి: తొలుత గణపతిని కీర్తిస్తూ ‘వినాయక కౌత్వం’, ‘మూషిక వాహన’ కీర్తనలకు లయబద్ధమైన అడుగులతో ప్రార్థనా నృత్యం సమర్పించారు.

​మహిషాసురమర్దిని స్తోత్రం: దుర్గాదేవి దివ్య శక్తిని, రౌద్ర సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రదర్శించిన ‘అయిగిరి నందిని’ నృత్యం భక్తులను ఎంతగానో అలరించింది.

​అన్నమయ్య సంకీర్తనలు: తాళ్లపాక అన్నమాచార్యుల ప్రసిద్ధ కీర్తనలైన ‘వినరో భాగ్యము విష్ణుకథ’, జగన్మాతను కీర్తించే ‘చక్కని తల్లికి చాంగుభళా’ సంకీర్తనలకు చక్కని హావభావాలు, ముద్రలతో కూడిన అభినయాన్ని ప్రదర్శించి మెప్పించారు.

​సాంప్రదాయ కళలను, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే దిశగా దేవస్థానం నిర్వహిస్తున్న ‘ధర్మపథం’ వేదికపై ప్రతిభ కనబరిచిన నృత్య బృందాన్ని ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు భక్తులు  అభినందించారు. అనంతరం దేవస్థానం తరఫున కళాకారులకు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.

Related posts

రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు

Satyam News

నాసా కు గుడ్ బై చెప్పిన సునీతా విలియమ్స్

Satyam News

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

Satyam News

ప్ర‌ముఖ న్యాయ‌వాది కోల‌గ‌ట్ల త‌మ్మ‌న్నశెట్టి ఆత్మహత్య

Satyam News

ఏపీకి కేంద్రం కీలక ప్రాజెక్ట్‌… దేశానికే కీలకం…!!

Satyam News

జాతీయ రహదారిపై ‘మాఫియా’ మారణహోమం!

Satyam News

Leave a Comment