శ్రీకాకుళంహోమ్

అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్: 6 గురు హతం

#Encounter

అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్డర్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ మారేడుమిల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఉదయం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య చోటుచేసుకుంది. మావోయిస్టుల కీలక నాయకుడు, పలువురు పోలీసులపై దాడులకు సూత్రధారిగా భావించబడుతున్న మడ్వి హిడ్మా కూడా మరణించిన వారిలో ఉండొచ్చని ప్రాథమిక సమాచారం వచ్చినప్పటికీ, దీనిపై పోలీసులు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేదు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్‌ను పోలీసు శాఖకు చెందిన పలు విభాగాల సంయుక్త బలగాలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. అటవీ ప్రాంతంలో నిఘా చర్యల భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించగా, ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

Related posts

ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించిందా?

Satyam News

బండ్ల గణేష్ కుమార్తె వివాహ నిశ్చితార్థం

Satyam News

మన దేశంలో ఉద్యోగాల పరిస్థితి బాగానే ఉంది….

Satyam News

మోదీపై వైసీపీ ఎటాక్… కాంగ్రెస్ గూటికి జగన్..?

Satyam News

కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు

Satyam News

గుడివాడ పోలీసు స్టేషన్ లో జగన్ బంధువు

Satyam News

Leave a Comment