సినిమాహోమ్

‘సర్దార్ సర్వాయి పాపన్న’ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ

#PonnamPrabhakar

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఆగస్టు 21న విడుదల కానున్న ‘సర్దార్ సర్వాయి పాపన్న’ సినిమా ట్రైలర్‌ను మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని,పోస్టర్ కూడా చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యాన్ని స్థాపించి, మన ప్రాంతాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఆలోచనతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం సాగించారని అన్నారు. గోల్కొండను వేదికగా చేసుకొని బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనేక కోటలను జయించి, గోల్కొండ కోట వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించారని మంత్రి పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, స్వయం పాలన, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను, ఆయన చేసిన పోరాటాలను నేటి తరానికి, భావితరాలకు పరిచయం చేయడంలో సినిమా, పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. ఆయన చరిత్రను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమని మంత్రి తెలిపారు. పాపన్న గౌడ్ చరిత్రను వెండితెరపై ఆవిష్కరిస్తున్న చిత్ర యూనిట్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు పతాని రామకృష్ణ, దర్శకుడు, నిర్మాత లింగంపల్లి వెంకటేష్ గౌడ్, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మావిగన్‌పై జగన్‌ కోరిక తీరాలంటే.. చంద్రబాబు మరో 3 సార్లు..!!

Satyam News

మమత పార్టీకి మరో ఎదురుదెబ్బ: ఇక ఖాళీ

Satyam News

ఆ ఒక్క నిర్ణయం క్రికెట్ గతిని మార్చింది…

Satyam News

దీపావళి జోష్: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు

Satyam News

ప్రజల దగ్గరకు పోలీసు సేవలు: ఆన్‌సైట్ ఎఫ్ఐ ఆర్

Satyam News

రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా ఆశ

Satyam News

Leave a Comment