జాతీయంహోమ్

అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి: వాంగ్‌చుక్‌

#SonamWangchuk

ఢిల్లీ ఆందోళనలో పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌ డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిని ఆదివారం లోగా విడుదల చేయకపోతే నిరవధిక నిరాహార దీక్ష లేదా పాదయాత్ర చేపట్టాల్సి ఆయన హెచ్చరించారు.

ఎక్స్‌లో విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్‌చుక్‌ ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను ‘ప్రకటించని అత్యవసర పరిస్థితి’గా అభివర్ణించారు. ఓటరు జాబితాల సవరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో పాల్గొనాలని భావించిన పలువురు రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

శాంతియుతంగా, ఐక్యంగా నిరసన చేపట్టాలని తాను గతంలో సందేశం ఇచ్చినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఊహించలేదని వాంగ్‌చుక్‌ పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు పలువురు నేతలు ముందుకు రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని, అయితే వారందరినీ అరెస్టు చేసినట్లు ఇప్పుడు తెలిసిందని ఆయన అన్నారు.

శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, అఖిల భారత విద్యార్థి సంఘం నాయకురాలు నేహా బోరా తదితరులు ఉన్నారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని చెబుతూ ఢిల్లీ పోలీసులు పలువురు ఆందోళనకారులను ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు.

తనను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్‌ సింగ్‌తో కలిసి ఓ వీడియోను ఎక్స్‌లో విడుదల చేశారు. పోలీసుల చర్యలకు తాము భయపడబోమని ఆయన స్పష్టం చేశారు.

పోలీసులు తమను అదుపులోకి తీసుకున్నారని, తనతో పాటు సంజయ్‌ సింగ్‌ కూడా ఉన్నారని కేజ్రీవాల్‌ తెలిపారు. దేశ యువత మేల్కొందని, ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశత్వానికి తాము భయపడబోమని వ్యాఖ్యానించారు. ఓట్ల చోరీని ప్రజలు ఇకపై సహించబోరని, జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

దేశాన్ని కాపాడేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొనాలని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణపై వ్యక్తమవుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుల నిరసనలు, పోలీసుల నిర్బంధాలు దేశ రాజధానిలో రాజకీయ చర్చకు దారితీశాయి.

Related posts

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

Satyam News

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్

Satyam News

యాపిల్ పంటను దెబ్బతీసిన పర్యావరణ మార్పులు

Satyam News

స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం

Satyam News

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వైభవంగా ఆర్జిత సేవలు

Satyam News

గోదారోళ్ళ స్టైల్ అదిరింది గా…

Satyam News

Leave a Comment