విశాఖపట్నంహోమ్

మరోసారి దొరికిన వైసీపీ డ్రగ్ దొంగలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ లాగా చేస్తూ యువతని రక్షిస్తుంటే, వైసీపీ పార్టీ మాత్రం, యువతని డ్రగ్స్ కి బానిసులుగా మార్చటానికి, అన్ని ప్రయత్నాలు చేస్తుంది.. కానీ ఈగిల్ టీం వాళ్ళ అంతు చూస్తుంది.

బెంగళూరు నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో విశాఖపట్నానికి వస్తుండగా, చరణ్ అనే వ్యక్తిని ఈగిల్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి పట్టుకున్నారు. అతని వద్ద నుండి 36 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, ఈ స్ట్రిప్స్‌ను వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ విం‍గ్ అధ్యక్షుడు కొండా రెడ్డి కోసం తీసుకువస్తున్నట్టు వెల్లడైంది. అనంతరం కొండా రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యువతని డ్రగ్స్ బానిసలుగా మార్చటానికి, వైసీపీ విద్యార్థి విభాగం నేతలే రంగంలోకి దిగటంతో, ఆ పార్టీ ఎంత ప్రమాదమో అర్ధమవుతుంది.

Related posts

భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు

Satyam News

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వైభవంగా ఆర్జిత సేవలు

Satyam News

ఆటో డ్రైవర్లకు 16 కండిషన్లు

Satyam News

బాపట్ల జిల్లాలో వైభవంగా శ్రీరాముని కళ్యాణం

Satyam News

రూ.505 కోట్లు కొల్లగొట్టిన ఆన్ లైన్ గేమింగ్

Satyam News

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని ఏమన్నారంటే

Satyam News

Leave a Comment