26.2 C
Hyderabad
September 25, 2026
ఆధ్యాత్మికంహోమ్

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

#Indrakeeladri

శ్రీకృష్ణ జన్మాష్టమి (గోకులాష్టమి) పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం ఉదయం శ్రీకృష్ణ పూజా మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి.

​ఉదయం 8:00 గంటలకు ప్రధానాలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీకృష్ణ భగవానునికి విశేష పూజలు,పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ మరియు ఆలయ స్థానాచార్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు జరిపించారు.

​శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఆలయ చిన్న రాజగోపురం సమీపంలో దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్ర గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ పాల్గొని గోమాతకు పసుపు-కుంకుమలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం గోవులకు స్వయంగా గ్రాసం తినిపించి ఆశీస్సులు అందుకున్నారు.

​సనాతన ధర్మంలో గోసంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, శ్రీకృష్ణావతార విశిష్టతను చాటుతూ ప్రతి ఒక్కరూ గోసేవను కర్తవ్యంగా భావించాలని ఈ సందర్భంగా ఈవో పేర్కొన్నారు. ​ఈ పూజా కార్యక్రమాలలో స్థానాచార్యులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి జయంతి

Satyam News

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

Satyam News

తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించండి

Satyam News

ముంబైలో సామూహిక హత్యలకు భారీ కుట్ర?

Satyam News

గో సేవలో ఎక్సైజ్ శాఖ మంత్రి….

Satyam News

శ్రీ పద్మావతి అమ్మవారి  కార్తీక బ్రహ్మోత్సవాల‌లో సాంస్కృతిక‌ శోభ

Satyam News

Leave a Comment