పశ్చిమగోదావరిహోమ్

దళిత యువకుడికి సచివాలయంలో చిత్రహింసలు

#crime

కోడిపుంజులను అపహరించారనే నెపం తో ఒక దళిత యువకుడిని 3 రోజులు పాటు గ్రామ సచివాలయంలో నిర్భంధించి చిత్రహింసలు పెట్టిన దారుణ సంఘటన ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం లోని పెదవేగి మండలం జగన్నాధపురం గ్రామం లో జరిగింది.

కొలికిపాముల తేజ అనే దళిత యువకుడిని కోడిపుంజులు దొంగతనం చేసాడనే నెపంతో అదే గ్రామానికి చెందిన కోళ్ల పెంపకం దారులు స్థానిక గ్రామ సచివాలయంలో 3 రోజులు పాటు నిర్భంధించి తీవ్రంగా కొట్టి గాయ పరిచారు. అమానుషంగా దాడి చేయడం తో అతని చెయ్యి రెండు చోట్ల  విరిగిపోయింది. ఛాతీ పై పిడిగుద్దులు గుద్దడం వల్ల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మార్పీఎస్ ఏలూరు జిల్లా ఇంచార్జ్ కూచిపూడి సత్యం మాదిగ, ఏలూరు జిల్లా కో ఇంచార్జి కొత్తపల్లి మురళీకృష్ణ మాదిగ, టౌన్ ఇంచార్జి కాశీ కృష్ణ మాదిగ, MSP సీనియర్ నాయకులు ఐనపర్తి మాధవరావు మాదిగ, కందుల సంతోష్ మాదిగ వెళ్లి ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి తెలుసున్నారు.

దేశ చరిత్రలో ఎక్కడా కూడా దళితులను గ్రామ సచివాలయాలలో కూడు నీరు అందించకుండా మూడు రోజులు నిర్బంధించి దాడులు చేయడం ఇంతవరకు జరగలేదని ఎమ్ ఆర్ పి ఎస్ జిల్లా ఇంచార్జి సత్యం మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం లో దళిత యువకుడిని నిర్బంధించి దుర్భాషలాడుతూ దాడులు చేసి తీవ్రంగా గాయపరచిన సంఘటన ను జాతీయ ఎస్ సి ఎస్ టి కమీషన్ ,పౌర హక్కుల సంఘానికి,మానవ హక్కుల పరిరక్షణ సమితి దృష్టికి తీసుకెళ్లతామని చెప్పారు.

భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయం లో మూడు రోజులు దాడులకు పాల్పడి తీవ్రంగా గాయపరచిన వ్యక్తుల పై ఎస్ సి ఎస్ టి,తో పాటు మానవ హక్కుల ఉల్లంఘన , కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేయనున్నామని  సత్యం మాదిగ తెలిపారు.

Related posts

హ్యూమన్ ట్రాఫికింగ్‌ కేసులో వైసీపీ కార్యకర్త..అమెరికాలో అరెస్టు.!

Satyam News

ఈ ఘనత నా ఒక్కడిదే కాదు

Satyam News

ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?

Satyam News

ఇన్‌స్టా పెద్దాయనకు చంద్రబాబు భరోసా….. సిద్దాంతంలో ఇంటరెస్టింగ్‌ సీన్‌!

Satyam News

క్రీడాకారులు గెలుపు ఓటమి సమానంగా స్వీకరించాలి

Satyam News

శ్రీరామ జన్మభూమి ఆలయం శిఖరంపై కాషాయ ధర్మ ధ్వజం

Satyam News

Leave a Comment