ప్రపంచంహోమ్

స్పెయిన్ లో మునిగిన నౌక: భారతీయ నావికులు సేఫ్

#MTMEDAMRE

స్పెయిన్ సముద్ర తీరంలో ట్యాంకర్ నౌక మునిగిపోవడంతో జరిగిన పెను ప్రమాదం నుంచి 8 మంది భారతీయ నావికులు సురక్షితంగా బయట పడ్డారు. ఎం.టి. మెడ్ అమ్రే (MT MED AMRE) అనే ట్యాంకర్ నౌక బుధవారం స్పెయిన్ సమీప సముద్ర జలాల్లో మునిగిపోయింది.

ఈ ఘటనపై గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించిన కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ నౌకలో ఉన్న ఎనిమిది మంది భారతీయ సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపారు. వారందరినీ సురక్షితంగా తరలించి స్పెయిన్‌లోని సమీప ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

నౌక మునిగిపోయే పరిస్థితి ఏర్పడటాన్ని ముందుగానే గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై నౌకను విడిచిపెట్టారని మంత్రి వివరించారు. దీంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి, వైద్య సహాయం, భద్రతకు సంబంధించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.

నావికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు నౌక నిర్వహణ బాధ్యతలు చూసే సంస్థతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సోనోవాల్ వెల్లడించారు. సిబ్బందికి అవసరమైన వైద్య సహాయం అందేలా చూస్తున్నామని, వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు.

సముద్రంలో నౌకలు ప్రమాదాలకు గురైనప్పుడు భారతీయ నావికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. స్పెయిన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది భారతీయులు సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చే పరిణామంగా మారింది.

Related posts

ప్రధాన పుణ్య క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం

Satyam News

వనపర్తిలో ఎసిబి కార్యాలయం ఏర్పాటు చేయాలి

Satyam News

పవన్ కళ్యాణ్ పై వైసీపీ రెక్కీ?

Satyam News

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నాం

Satyam News

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే: మంత్రి ఉత్తమ్‌

Satyam News

విధ్వంసం నుంచి వికాసం వైపు ఆంధ్రప్రదేశ్ పయనం

Satyam News

Leave a Comment