హైదరాబాద్హోమ్

అర్హుడైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి

#Talasani

అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్‌ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. రాంగోపాల్‌పేట డివిజన్‌ నల్లగుట్టలో నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్లు తమ నమోదు పత్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు అందజేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఓటు వేసిన గ్రాడ్యుయేట్‌ ఓటర్లు కూడా మరోసారి తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.

గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుపై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. ఇంటింటికీ వెళ్లి అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి, ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటు హక్కును వినియోగించుకునేలా నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News

మంత్రి శ్రీధర్ బాబుతో విక్టోరియా విప్ లీ టార్లామిస్ భేటీ

Satyam News

ప్లాట్ ఫామ్ ఫీజును మళ్లీ పెంచిన స్విగ్గీ

Satyam News

రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు

Satyam News

విజయవంతంగా తొలి రోజు ఆర్టీసీ సమ్మె

Satyam News

రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉండడం సమాజానికి చేటు

Satyam News

Leave a Comment