ముఖ్యంశాలుహోమ్

హానీ ట్రాప్ తో లేడీ “కేడీ” టోకరా….

“హ‌య్‌….హౌ ఆర్ యూ..ఐయామ్ …యు ఆర్… “ఇలా ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయి ఆ కుర్రాడికి ప‌రిచ‌యం అయ్యింది. కుర్ర‌కారు..యుక్త వ‌య‌స్కుడు.. ఫేస్ బుక్ లో అమ్మాయి…డేటింగ్ బాగుంది…ఆన్ లైన్‌ద్వారానే ప‌రిచ‌యం పెంచుకున్నాడు…చాటింగ్ జ‌రిగింది.

అంతే అమ్మాయి మోజులో ప‌డిపోయాడు. కోరిన అమ్మాయికి కావ‌లింది.అడిగింది ఇచ్చాడు.. ! ఆ త‌ర్వాతే తెలిసింది….ఆన్ లైన్ చాటంగ్ ,ఫేస్‌బుక్ ఫేక్ ప‌రిచ‌యం త‌న‌ను బురిడీ కొట్టింద‌ని. ల‌బోదిబోమంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

ఇక ఆ కేసును ప‌ట్టుకుని తీగ‌లాగిన ఏకంగా డొంక‌నే ప‌ట్టేశారు…విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్.కోట రూర‌ల్ సీఐ అప్ప‌ల‌నాయుడు,జామి ఎస్ఐ జ‌నార్ధ‌న్ లు. ఫేస్ బుక్ తో పరిచయం పెంచుకుని, తీయగా మాట్లాడుతూ న‌వ య‌వ్వ‌న‌పు కుర్రాడిని “హాని ట్రాప్” ఉచ్చులోకి దింపి అలమండ సంతకు ర‌మ్మ‌ని చెప్పి ఒక పథకం ప్రకారం అతడిని బెదిరించి, కొట్టి, డబ్బులు డిమాండు చేయడంతోపాటు, బలవంతంగా అతడి మెడలోని బంగారు చైనును అప‌హ‌రించుకుపోయిందా ఫేస్‌బుక్ కి “లేడీ”

ఈ కేసులో ఆ లేడీతో పాటు ఆమె భ‌ర్త‌,మ‌రో ముగ్గురునిందితులను అరెస్టు చేసి, బంగారు చైను, మొబైల్ ఫోను, ఒక పల్సర్ బైకును రికవరీ చేసినట్లుగా విజ‌య‌న‌గ‌రం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత డీపీఓలోని విలేక‌రుల సమావేశంలో శ‌నివారం వివరాలను వెల్లడించారు.విశాఖ జిల్లా పెందుర్తి మండలం, పురుషోత్తమపురంకు చెందిన పాండ్రంకి కిర‌ణ్‌,ఉఫ‌లు భార్య, భర్తలు.భ‌ర్త కిర‌ణ్‌ సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ ను పరిశీలించి, ఎంపిక చేసుకున్న కొంతమంది వ్యక్తులకు మెసేజ్ లు చేస్తూ, వారితో తీయగా మాట్లాడుతూ, హాని ట్రాప్ కు పాల్పడేవారు.

కిరణ్ స్వయంగా దగ్గర ఉండి తన భార్య ఉషతో అవ‌త‌ల వ్య‌క్తుల‌తో వాట్సాప్ కాల్స్ మాట్లాడించేవాడు. ఆ ట్రాప్ లోనే భీమిలికి చెందిన వెలవలపల్లి సాయి రమేష్ (28 ) అనే కుర్రాడు వ‌ల‌పు వ‌ల‌లో ప‌డిపోయాడు.

ర‌మేష్ తో వాట్సాప్ కాల్స్, చాట్స్ చేస్తూ ఫిబ్రవరి 14న జామి మండలం అలమండ సంత వద్దకు రావాలని కిలేడీ ఉష కోరింది.కిలేడీ మాట‌లు న‌మ్మ‌ని ఫిర్యాది వెలవలపల్లి సాయి రమేష్ అలమండ సంత వద్దకు రాగానే భార్య, భర్తలైన‌.భ‌ర్త కిర‌ణ్ ల‌తో పాటు ప్రసాద్, జామికి చెందిన బోని ఎర్నిబాబుతో కలిసి, రమేష్ పై దాడికి పాల్పడ్డారు.

తన భార్యకు మెసేజ్ లు, వాట్సాప్ కాల్స్ చేసి వేధిస్తున్నాడంటూ స్థానికుల‌ను న‌మ్మించి బలవంతంగా బైక్ పై ర‌మేష్ ను భీమసింగి వైపు తీసుకొని వెళ్ళి, చేతులతో కొట్టి, కత్తితో బెదిరించి, మెడలోని 18 గ్రాముల బంగారు చైన్‌ ను బలవంతంగా తీసుకొని, అదనంగా మరో రూ80 వేలు ఇవ్వాలని డిమాండు చేసారు.

చివరకు ఫిర్యాది ర‌మేష్‌ ఫేస్ బుక్‌ ఖాతాలోని , మొబైల్ ఫోన్ వాట్సాప్ చాట్స్ ను, కాల్స్, మెసేజ్ లను డిలీట్ చేసి, ఎక్కడా ఫిర్యాదు చేయవద్దని భయపెట్టి, హెచ్చరించి, చివరకు వదిలేసారు.అయితే తన తప్పు లేకున్నా, నిందితులు తనపై దాడి చేసి, బంగారు చైను దోచుకున్నారన్న కారణంతో మార్చి 3న జామి పీఎస్ లో ఫిర్యాదు చేసార‌ని ఎస్ఐ వై.వీర జనార్ధన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి, ఫేస్ బుక్ ఖాతా ఆధారంగా నిందితులను గుర్తించి, అరెస్టు చేసారని ఏఎస్పీ సౌమ్య‌ల‌త చెప్పారు.

నిందితుల వ‌ద్ద నుంచీ మొబైల్, పల్సర్ బైకు, బంగారు చైను స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. సోషల్ మీడియాలో పరిచయాలను నమ్మవద్దని, గుర్తు తెలియని వ్యక్తుల ప్రలోభాలకు గురి కావద్దని ఏఎస్పీ సౌమ్య‌ల‌త హెచ్చ‌రించారు.

అప‌రిచిత వ్య‌క్తుల వ‌ల‌లో ప‌డొద్ద‌ని ప్రజలకు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత విజ్ఞప్తి చేసారు.ఈ సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్.కోట రూరల్ సిఐ ఎల్.అప్పల నాయుడు, జామి ఎస్ఐ వై.వీర జనార్ధన్ పాల్గొన్నారు.

Related posts

వైసీపీ కేతిరెడ్డి భూ ఆక్రమణ: ఇద్దరి సస్పెన్షన్

Satyam News

అయోధ్య రామమందిర విరాళాల చోరీ: 150 మంది దొంగలు?

Satyam News

మహిళల ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Satyam News

మేడారం జంపన్నవాగులో జలకళ

Satyam News

మన అవయవాలు కాపాడుకోవడం ఎలా?

Satyam News

అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి

Satyam News

Leave a Comment