ప్రపంచంహోమ్

సంస్కరణలపై తిరగబడ్డ విద్యార్ధులు: 3 లక్షల మంది వీధుల్లోకి

#EiffelTower

సంస్కరణలు, ప్రభుత్వ బడ్జెట్ కోతలు, పాఠశాలల్లో సిబ్బంది కొరత, తరగతి గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు, మౌలిక వసతుల లోపాలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో ప్రారంభమైన విద్యార్థుల ఆందోళనలు క్రమంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారుతున్నాయి.

సెప్టెంబర్ చివర్లో పారిస్ శివార్లలోని క్రెటైల్ ప్రాంతంలో ప్రారంభమైన నిరసనలు ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. విద్యార్థులకు మద్దతుగా ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది, ప్రభుత్వ రంగ ఉద్యోగులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు సెప్టెంబర్ 29న నిర్వహించిన దేశవ్యాప్త నిరసనల్లో 3 లక్షల మందికి పైగా పాల్గొన్నట్లు కార్మిక సంఘం సీజీటీ ప్రకటించింది. అయితే ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఆ రోజు దేశవ్యాప్తంగా 2.06 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారు. పారిస్‌లోనే వేలాది మంది ర్యాలీలు నిర్వహించారు.  కొనుగోలు శక్తి తగ్గడం, ప్రభుత్వ రంగంలో సిబ్బంది కొరత, 2027 బడ్జెట్‌లో ప్రభుత్వ సేవలకు తగినన్ని నిధులు కేటాయించకపోవడం వంటి అంశాలు కూడా ఆందోళనలకు కారణమయ్యాయి.

ఉపాధ్యాయుల కొరత తోనే అసలు ఇబ్బంది

విద్యా సంస్థల్లో మౌలిక వసతుల పరిస్థితి, ఉపాధ్యాయుల కొరత, అధిక సంఖ్యలో విద్యార్థులతో తరగతులు నిర్వహించడం, ఎక్కువ పని గంటలు, పాఠశాలల్లో సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటి అంశాల చుట్టూ కొనసాగుతోంది. కొన్ని పాఠశాలల్లో భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, తరగతి గదుల్లో అధిక ఉష్ణోగ్రతలు, మరమ్మతులు అవసరమైన పరిస్థితులు కూడా విద్యార్థుల అసంతృప్తికి కారణమయ్యాయి.

దీంతో వందలాది పాఠశాలలు మూతపడ్డాయి. అక్టోబర్ 5న దేశవ్యాప్తంగా 400 నుంచి 500 వరకు ఉన్నత పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేయబడే పరిస్థితి ఏర్పడిందని ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి ఎడ్వార్డ్ గెఫ్రే తెలిపారు. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి 24 పాఠశాలలు ధ్వంసం లేదా దగ్ధం అయ్యాయని, విద్యాశాఖకు చెందిన 78 మంది సిబ్బంది గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. గత వారం రోజులుగా సుమారు 5,000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిలో అధిక శాతం యువకులేనని అధికారులు వెల్లడించారు.

విద్యార్ధుల ఉద్యమానికి కార్మికుల మద్దతు

విద్యార్థుల ఉద్యమానికి ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగుల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. అగ్నిమాపక సిబ్బంది అదనపు సిబ్బంది, మౌలిక వసతులు, మెరుగైన పని పరిస్థితుల కోసం నిరసనల్లో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లో సిబ్బంది కొరత, అధిక పని భారం, విద్యా రంగానికి మరిన్ని నిధులు అవసరమనే డిమాండ్లను ముందుకు తెస్తున్నారు.

ఫ్రాన్స్ ప్రభుత్వం 2027 బడ్జెట్‌ను ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఆందోళనలు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. విద్యారంగానికి ప్రభుత్వం ప్రతిపాదించిన నిధులపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిరసనల సందర్భంగా చోటుచేసుకుంటున్న హింస, ఆస్తుల ధ్వంసాన్ని ప్రభుత్వం ఖండిస్తోంది. విద్యార్థులు లేవనెత్తుతున్న సమస్యలు చర్చించదగినవేనని ప్రభుత్వం అంగీకరిస్తూనే, హింసాత్మక ఘటనలను సహించబోమని స్పష్టం చేస్తోంది.

ఐఫిల్ టవర్ పరిసరాల్లో భారీ జనసందోహాలు, నిరసనల సమయంలో బాణసంచా వంటి దృశ్యాలు కనిపించాయి. విద్యా సమస్యలతో ప్రారంభమైన ఆందోళనలు ఇప్పుడు ప్రభుత్వ బడ్జెట్ విధానాలు, ప్రజా సేవలకు నిధులు, ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులు వంటి విస్తృత అంశాలను కూడా తమ పరిధిలోకి తీసుకున్నాయి. దీంతో ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఈ ఉద్యమం రానున్న రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలపై ప్రభుత్వం, భద్రతా సంస్థలు దృష్టి సారించాయి.

Related posts

శ్త్రీ శక్తి డిజిటల్ మహానాడుకు అనంతపురంలో ఘన ఏర్పాట్లు

Satyam News

ఫుట్‌పాత్ ఆక్రమణలపై అధికారుల కొరడా

Satyam News

రూ 20 కోట్ల విలువగల గంజాయి కాల్చివేత

Satyam News

మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Satyam News

క్యూర్ ప‌రిధిలో కొత్తగా ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ఇక్కడే…

Satyam News

చిట్యాల వద్ద ప్రమాదం: నలుగురు మృతి

Satyam News

Leave a Comment